Anupamma Parameshwaran : బటర్ ఫ్లై ట్రైలర్ రిలీజ్

మలయాళం లో తెరకెక్కిన ‘ప్రేమమ్’ మూవీలో తన నటనతో కుర్రకారు మనసు దోచేసింది అందాల సుందరి అనుపమ పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అ, ఆ” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ‘బటర్ ఫ్లై’ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది.

సైకలాజికల్ త్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు గంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ అపార్ట్మెంటులో యువతికి ఎదురయ్యే అనూహ్య పరిణామాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే గుర్తు తెలియని వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బు అందుకున్న తర్వాత వారిని చంపేస్తాడు. అనుపమ పిల్లలు కూడా కిడ్నాప్ చేయబడతారు. ఆమె తర్వాత ఏమి చేస్తుంది. అనేది మిగిలిన కథ. సింపుల్ గా, పవర్ ఫుల్ గా కట్ చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కి ప్లస్ అయ్యింది. ఈ థ్రిల్లర్ లో భూమిక చావ్లా, రావు రమేష్, నిహాల్ కోదటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

- Advertisement -

https://youtu.be/puz3QoiRNbk

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు