VS10: ఫొటోలతో హీట్ ఎక్కిస్తున్న మీనాక్షి చౌదరి

సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది మీనాక్షిచౌదరి. సుశాంత్, ప్రముఖ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చిలసౌ అనే సినిమాలో నటించగా, ఆ సినిమా సూపర్ హిట్టై, వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సుశాంత్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో అలర్ట్ అయిన సుశాంత్ కాస్త కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. కథల విషయంలో జాగ్రత్త తీసుకొని “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా విషయంలో కాంప్రమైజ్ అవకుండా మిస్ ఇండియా గ్రాండ్ పోటీలో రన్నర్ అప్ గా నిలిచిన మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. అలా మీనాక్షి చౌదరి టాలీవుడ్ కి పరిచయమైంది.

అయితే సినిమా కాసెప్ట్ కొత్తగా ఉన్నా, కథనంలో లోపాలుండటంతో ఈ సినిమా థియేటర్స్ లో సరిగా ఆడలేదు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం తన అందంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మీనాక్షి చౌదరి రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కెరీర్ బిగియింగ్ లోనే రవితేజ తో సినిమా పడగానే సక్సెస్ ఫుల్ హీరోయిన్ కొనసాగుతుందేమో అనుకుంటే, ఖిలాడీ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడు కెరీర్ చిక్కుల్లో పడిపోయింది.

ఇటీవలనే మీనాక్షి చౌదరి.. అడవి శేష్ హీరోగా వచ్చిన హిట్2 సినిమాలో నటించింది. శైలేశ్ కొల‌ను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించటంతో మళ్ళీ మీనాక్షి కి ఊపు వచ్చింది. ప్రస్తుతం ఆమె విశ్వక్ సేన్ హీరోగా రాబోయే సినిమాలో నటిస్తుంది. అలాగే ఈ మధ్యనే ఒక తమిళ్ సినిమాకి కూడా ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా సినిమాలలో బిజీ గా ఉంటూనే ఈ బ్యూటీ, తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.అయితే రీసెంట్ గానే ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో ఒక స్టీల్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది వైరల్ అయింది. ఇక కామెంట్స్ లో అంత మీనాక్షి చౌదరిని హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు