Mrunal Thakur: ఇదే మొదటిసారి నాకు..మృణాల్ ఠాకూర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్

ఈ మధ్య మృణాల్ ఠాకూర్ జోరు మాములుగా లేదు. ఒక పక్క ఆన్ లైన్ లో మరోపక్క ఆఫ్ లైన్ లో ఎటు చేసిన మృణాలే కనిపిస్తుంది. ఇటీవలనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న మృణాల్, తన అందంతో అవుట్ ఫిట్స్ తో రెడ్ కార్పెట్ పై సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్, ఆమె సొంత పేరు కంటే కూడా సీత గానే ఎక్కువ మందికి తెలుసు. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చక్కగా చీరతో, ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా.. కనపడటంతో నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉంటుందేమో అనుకున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. కానీ తెర వెనక మృణాల్ వేరు అని వాళ్ళకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఐపోయింది. వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది సందడి చేయడానికి రెడీ అయింది. అలాగే తెలుగులో ఈమె నాని హీరోగా ఒక సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై జరుగుతుండగా, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి రిటర్న్ అయిన మృణాల్ వెంటనే నాని సినిమా షూటింగ్ లో పాల్గొంది.

- Advertisement -

సాధారణంగా తెలుగు సినిమాలు హైదరాబాద్ లో జరుగుతాయి. కానీ నాని30 సినిమా షూటింగ్ ముంబై జరగుతుండటంతో ఎక్సైట్ అయిన మృణాల్ ఠాకూర్ తన ఇంస్టాగ్రామ్ లో మొదటి సారి ఒక సౌత్ సినిమా షూటింగ్  తన హోమ్ టౌన్ అయిన ముంబై చేయడం సంతోషంగా ఉంది. అంటూ షూటింగ్ లో దిగిన పిక్స్ పోస్ట్ చేస్తూ, తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. నాని, మృణాల్ ఈ సినిమాలో ఒక 6 సంవత్సరాల పాపకి పేరెంట్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు