Eagle: మాస్ మహారాజా వెనక్కు తగ్గాడా.?

మామూలు టైంలో రిలీజ్ అయ్యే సినిమాలు కంటే సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకి విపరీతమైన బజ్, విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సంక్రాంతికి ఒక సినిమా వచ్చి ఒక యావరేజ్ టాక్ తో నడిచినా కూడా కాసులు వర్షం కురుస్తుంది అనేది అందరికీ తెలిసిందే.  అందుకని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతి సంక్రాంతికి తన బ్యానర్ నుంచి ఒక సినిమాను దించుతుంటారు.  ఎందుకంటే సంక్రాంతికి ఉన్న డిమాండ్ అలాంటిది.  సంక్రాంతికి సినిమా చూడటం అనేది  తెలుగు ప్రేక్షకులకి ఒక ఆనవాయితీగా మారిపోయింది.  అందుకని చాలా సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి.

2024 సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమాలు ఇప్పటికే పాగా వేసి కూర్చున్నాయి.  త్రివిక్రమ్ మహేష్ బాబు, కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు నాగర్జున నటిస్తున్న “నా సామిరంగా”  అనే సినిమాను కూడా ప్రకటించారు.  రెండింటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ అనే సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

వీటన్నిటితోపాటు ఎప్పటిలానే దిల్ రాజు నిర్మిస్తున్న “ఫ్యామిలీ స్టార్”   సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది.  అయితే వీటన్నిటితో పాటు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో  మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సంక్రాంతి నుంచి ఈ సినిమా జనవరి 26 కి పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు డబ్బింగ్ సినిమా “తంగలాన్ ” కూడా అదే డేట్ కి  రానుంది.  ఏదేమైనా సంక్రాంతి తాకిడికి తట్టుకోలేక థియేటర్లు దొరుకుతాయో దొరకవో తెలియక మాస్ మహారాజా సినిమా కొంత వెనక్కు తగ్గింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు