Devara: తంగం చేతికి ఉన్న పచ్చ బొట్టు కథేంటి?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా, బడా ప్రొడ్యూసర్ బోని కపూర్ గారాల కూతురిగా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ధఢక్, గుంజన్ సక్సేనా లాంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా సక్సెస్ తో పాటు స్టార్ డమ్ మాత్రం ఇంకా రాలేదు.

అందుకే కొరటాల శివ తో తీస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ఈ సినిమా నుండి తాజాగా జాన్వీ కపూర్ లుక్ ఒకటి తన ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. ఇక అప్పట్నుంచి ఆ ఫొటో సోషల్ మీడియా తెగ వైరల్ అయింది. అయితే ఆ ఫోటో వైరల్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల కాదు. టాలీవుడ్ మూవీ లవర్స్ కూడా చేయలేదు.

కామన్ గా జాన్వీ ఫ్యాన్స్ వైరల్ చేసారు. అంత వైరల్ చేయడానికి ఆ ఫోటో లో అంత గ్రాండియర్ ఏముందబ్బా అని జనాలు అనుకోవచ్చు. ఆ ఫోటో వైరల్ అవడానికి మెయిన్ రీసన్, ఆ పిక్ లో జాన్వీ కపూర్ చేతి పై ఉన్న ట్యాటూ. ఆ ట్యాటూ పై నిన్నటినుంచి రకరకాల రూమర్స్ సోషల్ మీడియా లో వస్తున్నాయి.

- Advertisement -

చాలా మంది టాలీవుడ్ ఫ్యాన్స్ ఇప్పుడే ఆ ట్యాటూ గమనించారు కాబట్టి, దేవర సినిమా కోసం ఆ సినిమాలో హీరో పచ్చ బొట్టు వేయించుకుని ఉండొచ్చు అని, మరికొందరు తన బాయ్ ఫ్రెండ్ నేమ్ ని ట్యాటూ వేయించుకుందని అనుకున్నారు.

ఇంకొందరి ఫ్యాన్స్ వాదన ఏంటంటే ఆ ట్యాటూ పై తంగం అనే పేరు ఉందని, జాన్వీ ప్రస్తుతం చేస్తున్న దేవర లో తంగం అనే పేరున్న పాత్రలో నటిస్తుందని, అంతే కాదు శ్రీదేవి మొదటి సినిమాలో పాత్ర పేరు కూడా ‘తంగం’, కాబట్టి ఆ పేరుతో శ్రీదేవి సెంటిమెంట్ తో జాన్వీ కపూర్ ట్యాటూ వేయించుకుంది అంటున్నారు.

అయితే అసలు నిజమేంటంటే జాన్వీ చేతి పై వేసుకున్న ట్యాటూ వాళ్ళ అమ్మ శ్రీదేవి పేరు. “I love you my labbu” అని వాళ్ళ అమ్మని ముద్దుపేరుతో పిలిచే పేరుని ట్యాటూ వేసుకుంది. దీంతో అసలు విషయమిది అని తెలిసిన ట్రోలర్స్ సైలెంట్ అయ్యారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు