ManiRatnam : ఐమ్యాక్స్ ఫార్మాట్ లో..

అగ్ర దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్-1. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్స్‌పై మణిరత్నం, అల్లిరాజా సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, నిలల్‌గల్ రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 30 వ తేదీన పొన్నియన్ సెల్వన్-1 తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.

పొన్నియన్ సెల్వన్ చిత్రం దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ సినిమా కోసం టీం భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తీసుకురానున్నారు. దీని కోసం అగ్ర దర్శకుడు మణి రత్నం ఆయన టీం ఇప్పటికే ప్రయత్నాలను స్టార్ట్ చేశారు.

కోలీవుడ్ లో ఇప్పటి వరకు ఐమ్యాక్స్ ఫార్మాట్ సినిమాలు రాలేవు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో వస్తే.. కోలీవుడ్ లో తొలి ఐమ్యాక్స్ ఫార్మాట్ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ నిలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం నుంచి టీజర్, పొంగే నది అంటూ సాగే పాట ఒకటి విడుదల అయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు