Lyric Song : ఒకటే కదా.. ఒకటే సదా జీవితం

విభిన్న కథనాలతో ప్రేక్షకుల ముందకు వచ్చే శర్వానంద్ తాజా గా కొత్త స్టోరీతో “ఒకే ఒక జీవితం” అనే చిత్రంతో వస్తున్నారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. హీరోగా శర్వానంద్, హీరోయిన్ గా పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ నటిస్తున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత అక్కినేని అమల సిల్వర్ స్క్రిన్ పైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీరితో పాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి మాటలను తరుణ్ భాస్కర్‌ అందించగా, సంగీతాన్ని జెక్స్ బిజోయ్ సమకూర్చారు.

ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న చిత్ర యూనిట్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ‘ఒకే ఒక జీవితం’గా, తమిళంలో ‘కణం’ గా ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడటంతో ప్రమేషన్ పనులను వేగం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అమ్మ పాట ఒకటి విడుదలైంది. అమ్మ ప్రేమతో ఈ చిత్రం సాగుతుందని ఈ పాటతో తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మరో సాంగ్ ను వదిలారు.

‘ఒకటే కదా.. ఒకటే సదా.. జీవితం’ అంటూ సాగే ఈ పాట జీవితం గురించి వివరిస్తుంది. ఉన్నది ఒకటే జీవితం.. ఈ జీవితంలోనే అన్ని సాధించాలి అన్నట్లు ఈ పాట సాగుతుంది. అలాగే హీరో, హీరోయిన్లు శర్వానంద్, రీతూ శర్మ మధ్య ఉన్న ప్రేమను కూడా ఈ పాటలో చూపించారు. అలాగే కమెడియన్ ప్రియదర్శికి సోల్ మెట్ సెర్చింగ్ గురించి, వెన్నెల కిషోర్ చదువు, ఉద్యోగం గురించి ఈ పాటలో చూపించారు. పాటలో జెక్స్ బిజోయ్ మ్యూజిక్ బాగుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు