Manchu manoj : మోహన్ బాబు-చిరంజీవి మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్..!!

Manchu manoj : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం – మంచు కుటుంబం మధ్య ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలకు ఇండస్ట్రీలో పడదని ఎన్నోసార్లు రుజువు కూడా అయింది.. నిన్నటి రోజున రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలుగు హీరోలు దర్శక నిర్మాతలు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మంచు – మెగా ఫ్యామిలీ మధ్య గొడవల గురించి, అలాగే రామ్ చరణ్ గురించి మంచు మనోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

మంచు – మెగా ఫ్యామిలీ మధ్య దూరకండి..

ముఖ్యంగా మంచు – మెగా ఫ్యామిలీ మధ్య ఉండేటువంటి వైరం గురించి కూడా చెప్పిన మాటలు అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి..అలాగే చిరంజీవి – మోహన్ బాబు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారని.. మరి వారి పిల్లలు మాత్రం ఇలా స్నేహంగా ఎలా ఉన్నారని అందరూ అడుగుతూ ఉంటారు అంటూ తెలిపారు మంచు మనోజ్..అయితే ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం పైన మనోజ్ మాట్లాడుతూ.. భార్య భర్తలు గొడవలు పడితే మధ్యలోకి వెళితే ఏమవుతుందో అలానే వారిద్దరి మధ్యలోకి కూడా ఎవరు వెళ్ళవద్దు.. వారిద్దరు కూడా అలాంటి వారే.. టామ్ అండ్ జెర్రీ టైపు అంటూ తెలిపారు. వాళ్లది 45 ఏళ్ల బంధం అని రిలేషన్షిప్ బిట్వీన్ మంచు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్.. బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్ మెన్ అనే డైలాగ్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. మొత్తానికి అయితే మొన్న మంచు విష్ణు, ఇప్పుడు మంచు మనోజ్ అన్నదమ్ములిద్దరూ పని కొట్టుకొని మరీ మంచు , మెగా ఫ్యామిలీ ల మధ్య ఎటువంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు..

రామ్ చరణ్ మంచితనం..

ముఖ్యంగా మంచు మనోజ్ తన స్పీచ్ లో చెప్పిన విషయాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ తనకు ఒక మంచి మిత్రుడు అని అలాంటి మిత్రుడు బర్తడే ఈవెంట్ కు రావడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. ప్రతి ఏడాది కూడా అభిమానులు ఎంతో గ్రాండ్గా తన బర్తడే ని సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు మంచు మనోజ్. అలాగే రామ్ చరణ్ చిన్నతనం నుంచి తనకు మంచి స్నేహితుడని కూడా వెల్లడించారు.

- Advertisement -

చరణ్ ఫ్రెండ్ కావడం నా అదృష్టం..

ఈ కాలంలో చాలామందికి ఇలాంటి స్నేహం దొరకడం చాలా కష్టము.. అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహితులతో చాలా బిజీగా ఉంటున్నారు.. పాతవారిని మర్చిపోతున్నారంటూ తెలిపారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా తన చిన్ననాటి స్నేహితులను మాత్రం అలాగే వెంటపెట్టుకొని ఉన్నారంటూ తెలిపారు.. మేము చెన్నైలో కూడా అందరము పక్కపక్కనే ఉండే వాళ్లమని వెల్లడించారు మంచు మనోజ్. రామ్ చరణ్ కు ఎవరైనా కష్టాలలో ఉంటే సహాయం చేయడం చాలా ఇష్టం అని తెలియజేశారు. తనకు తోచిన సహాయం కూడా తాను కూడా చేస్తూ ఉంటానని మంచు మనోజ్ వెల్లడించారు.

రామ్ చరణ్ సహాయాన్ని మరచిపోలేను..

అలాగే తనకు ఒకరోజు డబ్బు కావాల్సి వచ్చింది ఆ అర్ధరాత్రి ఎవరికి ఫోన్ చేయాలో తెలియక రామ్ చరణ్ కు ఫోన్ చేసి రూ.5లక్షలు అడిగాను.. బాబాయ్ ఇలా ఒక ఆడబిడ్డ కు చాలా కష్టంగా ఉంది అని చెబితే.. చెప్పిన వెంటనే ఆలోచించకుండా ఐదు లక్షల రూపాయలు అందించారని, అది రామ్ చరణ్ గొప్పతనం అంటూ తెలిపారు మనోజ్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు