Manchu Lakshmi: నా రక్తం మరిగిపోతోంది

తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని నటి మంచు లక్ష్మి. మంచు లక్ష్మి నటిగానే కాదు, యాంకర్, నిర్మాతగాను రాణిస్తున్నారు. తొలి రోజుల్లో ఆమె కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ ఆనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యాంకర్ గా ఆమె మాట్లాడే మాటలు ఎంతగానో ఫేమస్.

ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న మంచు లక్ష్మి ఓటిటి ప్లాట్ ఫామ్ లోను సందడి చేస్తుంది. ఇక ఇటీవల తన తమ్ముడు మంచు మనోజ్ పెళ్లిని దగ్గరుండి చేసింది మంచు లక్ష్మి. ఈ విషయాన్ని మంచు మనోజ్ కూడా చెప్పాడు. తన అక్కకు ఎప్పుడు రుణపడి ఉంటానని వివరించారు మంచు మనోజ్.

అయితే, ఇది ఇలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డగించాడో పోలీస్. ఆమెపై అభ్యంతరకరంగా చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆ బాలిక ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది. దీన్నంతటిని కొందరు వ్యక్తులు ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఈ వీడియోపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ ట్వీట్ చేసింది. ఆడవారిని కాపాడాల్సిన పోలీసే ఇంతటి దారుణానికి ఒడిగడితే ఇంకెవరిని సాయం చేయమని అడుగుతాం అని ఆవేదన చెందుతున్నారు మహిళలు. ఇక ఈ వీడియో తీసిన వాళ్ళు పోలీస్ నుంచి ఆ అమ్మాయిని కాపాడితే బాగుండేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు