Vishwak Sen: ప్రేక్షకులకు ధమ్కీ ఇచ్చేందకు డేట్ ఫిక్స్..

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌ని చూపించే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో క్లాస్‌తో పాటు మాస్ అవతార్‌ లో కనిపించారు విశ్వక్ సేన్.

అత్యంత భారీ బడ్జెట్‌తో వున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది

మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, రామ్ మిరియాల మావా బ్రో పాటను స్పెషల్ గా కంపోజ్ చేశారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచింది.

- Advertisement -

వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని దినేష్ కె బాబు నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా అన్వర్ అలీ ఎడిటర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ప్రముఖ తారాగణం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు