Mamitha Baiju : సెన్సేషనల్ హీరోయిన్ కు దిమ్మ తిరిగే ఫ్లాప్

Mamitha Baiju : ప్రేమలు మూవీతో బాగా పాపులర్ అయిన మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజుకు తాజాగా గట్టి షాక్ తగిలింది. రీసెంట్ సెన్సేషన్ గా మారిన ఈ కుర్ర భామను యూత్ అంతా తెగ ఆరాధిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమెకు దక్కిన పాపులారిటీని చూసి మమితను ఆపడం ఇక ఎవ్వరి తరం కాదు అనుకున్నారంతా. కానీ తాజా మూవీతో ఈ బ్యూటీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

మమితకు “రెబల్” షాక్…

ప్రేమలు మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారింది మమిత బైజు. ఇప్పుడు సౌత్ సినీ ప్రియుల దృష్టి మొత్తం ఈ అమ్మడి పైనే ఉంది. మరి ఆ అంచనాల ఫలితమో, ఆమె బ్యాడ్ టైమో తెలీదు గానీ మమితకు తాజా మూవీ గట్టి షాకే ఇచ్చింది. జీవి ప్రకాష్ కుమార్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం రెబల్. డైరెక్టర్ నికేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో మమిత బైజు (Mamitha Baiju) పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం కూడా ఈ సినిమాలో మైనస్ పాయింట్ అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. ప్రేమలు మూవీతో సౌత్ లో ఫుల్ గా పాపులర్ అయిన మమితకు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. పాపులారిటీ దక్కిన రోజుల వ్యవధిలోనే ఒక భారీ డిజాస్టర్ తన ఖాతాలో పడడం అనేది ఆమె కెరియర్ కు నష్టాన్ని కలిగించే అంశమే. నెక్స్ట్ మూవీకి కూడా ఇదే జరిగిందంటే ఆ తర్వాత మమిత బైజుకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

మొదటి మూవీతోనే ఫెయిల్యూర్…

సెన్సేషనల్ బ్యూటీ మమిత బైజుకు ఇదే మొదటి తమిళ చిత్రం. రెబల్ మూవీలో ఆమె ఎక్కువగా స్లో మోషన్ షాట్లలో మాత్రమే కనిపిస్తుంది. పైగా కారణం లేకుండా నవ్వుతూ ఉండడం చికాకు తెప్పిస్తుంది. ప్రేమలు మూవీలో ఈ అమ్మడు రిఫ్రెష్ గా కనిపించింది. దాంతో పోలిస్తే ఈ సినిమాలో ఆమె నటన ఆడియన్స్ ను నిరాశపరిచిందనే చెప్పాలి. అయితే నిజానికి ఇది ఆమె తప్పేం కాదు. మేకర్స్ ఆమె పాత్రను అంత పేలవంగా రాసుకున్నారు. అంతేకాకుండా ప్రేమలు మూవీ రిలీజయ్యి సంచలనం సృష్టించడానికి ముందే ఈ మూవీకి మమిత సైన్ చేసింది. కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ కు ఆమెను నిందించలేము. అయితే మమిత మాత్రం ప్రాజెక్ట్స్ సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తెలివిగా ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా మారడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టదు. లేదంటే మమత వన్ మూవీ వండర్ గా నిలిచిపోయే అవకాశం ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ తాను మాత్రం సెలెక్టివ్ గా వ్యవహరిస్తున్నానని వెల్లడించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ తన పారితోషకాన్ని కూడా డబుల్ చేసేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు 50 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. మరి మమిత నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు