SSMB28 : మళ్ళీ సినిమాలకి లాంగ్ బ్రేక్ ఇవ్వనున్న మహేష్

మహేష్ మళ్ళీ సినిమాలకి లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నడంట. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్ రాధా కృష్ణ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన పూజ హేగ్దే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

అయితే ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా హుటా హుటిన షూటింగ్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ ఒకటి, రెండు షెడ్యూల్ లు కంప్లిట్ అవ్వగానే సినిమాని ఆపేసారు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తోన్న వినోదయ సీతాం రీమేక్ సినిమాకి మాటల రచయితగా పని చేస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ కి దగ్గరికి వస్తుండటంతో త్రివిక్రమ్ మహేష్ సినిమాకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందంట. త్రివిక్రమ్ ప్రవర్తన ఇబ్బందిగా మారిన మహేష్ వెంటనే విదేశాలకి హాలిడే ట్రిప్ కి వెళ్లిపోయారు.

త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పై తొందరలోనే అఫీషియల్ న్యూస్ రానుంది. అయితే మహేష్ రాజమౌళిల సినిమా మొదలవ్వడానికి చాలా సమయమే పడుతుంది. రాజమౌళి పక్క ప్రణాళిక లేకుండా సినిమా స్టార్ట్ చేయరు. అలాగే సినిమాకి ముందు వర్క్ షాప్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకున్న మహేష్ ప్రస్తుతం ఏ కథలు వినటం లేదంట. త్రివిక్రమ్ సినిమా ఫినిష్ చేసి రాజమౌళి సినిమా షూటింగ్ కంప్లిట్ అయ్యేదాకా ఆయన వేరే సినిమాలేవీ కమిట్ అవకూడదని ఫిక్స్ అయ్యారంట. దీన్ని బట్టి చూస్తే మహేష్ కెరీర్ లో మళ్ళీ లాంగ్ బ్రేక్ వచ్చినట్టే.

- Advertisement -

త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నాం అని మూవీ టీం ఆల్రెడీ ప్రకటించింది. ఆ తరువాత రాజమౌళి సినిమా ఉంటుంది. అంటే ఏ మాత్రం లేదన్న జక్కన సినిమా పట్టాలెక్కడానికి ఒక సంవత్సరం పడుతుంది. షూటింగ్ కంప్లిట్ చేసి, రిలీజ్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. ఈ లెక్కన చూస్తే మహేష్ సినిమాకి లాంగ్ బ్రేక్ తప్పసరి అనిపిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు