Khushi : కళ్లు చెదిరే ధరతో లగ్జరీ హౌస్ ను సొంతం చేసుకున్న సమంత

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అని అంటే ముందుగా వచ్చే పేరు సమంత. ఈ స్టార్ హీరోయిన్ నుంచి వచ్చే సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఈమె ఇమేజ్ ఏ మాత్రం తగ్గిపోదు. సమంత నుంచి ఇటీవల శాకుంతలం అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడింది. నెగిటివ్ టాక్ రావడమే కాకుండా, కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. సమంత కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయినా, సామ్ కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గిపోలేదు.

ఇదిలా ఉండగా, సమంత గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ లో సామ్ కొత్త ఇంటిని కొనుగోలు చేసిందట. నగరంలోని నానక్ రాం గూడ దగ్గరలోని జయభేరి ఆరంజ్ కౌంటీలో ఖరీదైన ఫ్లాట్ ను సమంత కొన్నట్టు తెలుస్తుంది. 7944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ అన్ని సౌకర్యలతో విలాసవంతంగా ఉందని సమాచారం. ఇది 4 పడకగదుల డ్యూప్లెక్స్ హౌస్ ను తెలుస్తుంది. అలాగే అపార్ట్ మెంట్ లో 13వ ఫ్లోర్ లో సామ్ ఇల్లు ఉందట. అయితే ఈ ఫ్లాట్ ధర 7.8 కోట్లు అని తెలుస్తుంది.

కాగా, ప్రస్తుతం సామ్ హైదరాబాద్ లోని పలాటియల్ హౌస్ లో ఉంటుంది. ఈ ఇంటిని ముందుగా నాగ చైతన్యతో పెళ్లి అయ్యాకా, ప్రముఖ నటుడి నుంచి కొనుగోలు చేశారు. తర్వాత తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే డైవర్స్ తర్వాత ఈ ఇంటిని అమ్మేశారు. కానీ, ఈ ఇల్లు సమంత బాగా నచ్చడంతో తిరిగి కొనుగోలు చేసింది. కానీ, ఇప్పుడు జయభేరి ఆరంజ్ కౌంటీలో కొత్త ఇల్లు తీసుకోవడంతో, ఈ పలాటియల్ హౌస్ ను మళ్లీ అమ్మేసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

సమంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఖరీదైన బంగ్లాలే కాకుండా కాస్ట్లీ కార్లు అంటే సామ్ కి ఇష్టం. సమంత దగ్గర ప్రస్తుతం ల్యాండ్ రోవర్, బీఎమ్‌డబ్యూ7 తో పాటు మరి కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక్కొ సినిమాకు 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే సామ్ కు మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు