సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీన్ లో ఎంత ఎనర్జీ తో ఉంటారో
ఆఫ్ స్క్రీన్ లో అంత సెటిల్డ్ గా ఉంటారు, కానీ మహేష్ కు సెన్సాఫ్ హ్యూమర్ పీక్ లో ఉంటుంది. మీడియా వెటకారంగా ప్రశ్నలు అడిగితే చాలు దానికి ప్రతి ఫలంగా భీభత్సమైన పంచ్ దించుతాడు మహేష్.
మహేష్ కెరియర్ లో ఎన్నో బెస్ట్ ఫిలిమ్స్ ఉన్నాయ్, ఎన్నో ఎక్స్పెరిమెంటిల్ ఫిలిమ్స్ ఉన్నాయ్. ఈ మద్యకాలంలో మహేష్ సినిమాలో మెసేజ్ ఉంటుంది అని ఫీలింగ్ వచ్చింది కానీ అంతకుముందు పరిస్థితులు వేరు.
భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు సినిమాలు తరువాత రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా అభిమానులకు కొంత సంతృప్తిని ఇచ్చిందనే చెప్పొచ్చు. చాలా ఏళ్ళు తరువాత మహేష్ ను అలా చూడటం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ సినిమాకి రిలీజ్ డేట్ నుంచి మిశ్రమ వస్తూనే ఉంది. అయినా కలక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. అదే కంప్లీట్ హిట్ టాక్ వస్తే మహేష్ సినిమాకి ఇంకా కాసుల వర్షమే.
వర్క్ మీద సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టిన ప్రతి డైరెక్టర్ తో క్లోస్ గా మూవ్ అవుతాడు మహేష్.
ఇప్పటివరకు మహేష్ తో పని చేసిన కొంతమంది డైరెక్టర్స్ మహేష్ ను డైరెక్టర్స్ హీరో అంటారు అందులో తేజ , గుణశేఖర్ కూడా ఒకరు. మహేష్ కూడా అంతే డైరెక్టర్స్ ఏది చెప్తే అదే ఫిక్స్ అయి పనిచేసుకుంటూ పోతాడు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన మహేష్ ఈ పాటలో డాన్స్ బాగా వేసాడు అని మాట్లాడుకునే సందర్బాలు చాలా తక్కువ,
రీసెంట్ గా వచ్చిన “మా మా మహేష్” సాంగ్ లో మాత్రం మహేష్ ఒక లెవెల్ లో డాన్స్ చేసాడు, ఈ డాన్స్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా సక్సెస్ మీట్ ను కర్నూల్ ను లో జరిపారు.
ఈ ఈవెంట్ లో “మా మా మహేషా” పాటకు డాన్స్ చేసింది ఒక టీం, వీళ్ళతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా రెండు స్టెప్స్ వేస్తాడు,
ఆ టైం లోనే ఎవరు ఫోర్స్ చెయ్యకుండానే మహేష్ స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చేసాడు, ఒక స్టార్ హీరో ఎప్పుడు సైలెంట్ గా కూర్చునే మహేష్ అలా చేయడం అభిమానులకి చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది.