OTT : ఓటీటీల్లోనూ.. బాదుడే బాదుడు

ఓటీటీ.. ప్రస్తుతం సినీ లవర్స్ కు అందుబాటులో ఉన్న ఆయుధం. కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీ మోజులో పడ్డ ప్రేక్షకులు, దీనికి బానిస అయిపోయారు. ఒక్కొక్కరు కనీసం మూడు నుండి నాలుగు ఓటీటీ ప్లాట్ ఫాంలను డబ్బులు పెట్టి సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలైనా, థియేటర్స్ లో కంటే, ఓటీటీలో చూడటానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యకా, నాలుగు నుండి ఐదు వారాల్లోనే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఇప్పటి వరకు అన్ని సినిమాలు ఫ్రీ గానే ప్రసారం అయ్యాయి. కానీ తొలి సారి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు ఓటీటీల్లోనూ డబ్బులు వసూళ్లు చేయడానికి రెడీ అయ్యాయి. జీ 5 లో ఈ నెల 20 నుండి ఆర్ఆర్ఆర్ మూవీ అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఓటీటీల్లో చూడాలంటే.. సబ్ స్క్రైబర్లు కూడా అదనంగా 100 రూపాయలను పెంచింది. ఈ మొత్తం చెల్లించినా, కేవలం వారం రోజుల పాటే ఆర్ఆర్ఆర్ ను చూడవచ్చు.

కేజీఎఫ్-2 మూవీ, అమెజాన్ ప్రైమ్ ప్రసారం కావడానికి రెడీ గా ఉంది. ఈ మూవీని చూడాలంటే, సబ్ స్క్రైబర్లు కూడా అదనంగా 199 రూపాయలు చెల్లిస్తేనే ఈ సినిమాను చూడచ్చు. అది కూడా కేవలం రెండు రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. నిజానికి ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే టైంలో, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే టికెట్ల రేట్లను పెంచాయి. ఆర్ఆర్ఆర్ కు ఏపీ 75 రూపాయలు, తెలంగాణ 100 రూపాయలు పెంచింది. కేజీఎఫ్-2 కు రెండు రాష్ట్రాల్లో ప్రతి టికెట్ పై 50 రూపాయల వరకు పెంచారు. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి.

- Advertisement -

అది చాలదు అన్నట్టు, ఓటీటీల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ప్లాన్ వేస్తున్నారు. అయితే ఈ సినిమాలపై ఓటీటీ లవర్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అటు థియేటర్స్, ఇటు ఓటీటీల్లో డబ్బే లక్ష్యం నిర్మాతలు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వీటి లాగే చిన్న సినిమాలు కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసి డబ్బులు చెల్లించాలంటే, ఓటీటీ ఆదరణ తగ్గే ప్రమాదం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు