Prabhas: బుజ్జి ఈవెంట్ కోసం ఏకంగా అన్ని రోజులు కష్టపడ్డ ప్రభాస్..!

Prabhas: ప్రభాస్ ప్రజెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలలో కల్కి మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా ఇంటర్నేషనల్ రీచ్ అందుకుంటుంది. ప్రమోషన్స్ కూడా అదే లెవెల్ లో ప్లాన్ చేశారు డైరెక్టర్.

ఈ క్రమంలోనే త్వరలో నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్తో స్పెషల్ వీడియో పోస్ట్ చేపించారు. అనంతరం బుజ్జిని ఇంటర్వ్యూ చేశారు. స్ర్కాచ్ 4 అంటూ ముందుగా బుజ్జి బ్రెయిన్ ను క్లిప్పింగ్ ద్వారా పరిచయం చేయించి అనంతరం స్వయంగా ఈ కారును ప్రభాస్ ద్వారా లైవ్ లో అభిమానుల ముందుకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేశారు.

Prabhas worked hard all day for the Bujji event
Prabhas worked hard all day for the Bujji event

అయితే రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇక వారి కోసం ప్రభాస్ ఎంతగా కష్టపడ్డాడో వివరించారు మేకర్స్. స్పెషల్లీ డిజైన్డ్ కార్ తో బయట స్టంట్ చేయడం ఓకే కానీ బారికేడ్లు నిర్మించిన బ్యాక్ గ్రౌండ్ లో చేయడం కష్టమే. కొంచెం అటు ఇటు అయినా ప్రమాదం జరగవచ్చు. అందుకే ఇలాంటి రిస్క్ లేకుండా ఉండేందుకు మూడు రోజులు ప్రాక్టీస్ చేశాడట డార్లింగ్. రోజుకి ఐదు గంటల చొప్పున ఇందుకోసం కష్టపడ్డాడు డార్లింగ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు