Akhil marriage : అఖిల్‌ పెళ్లిపై నాగ్‌ కీలక నిర్ణయం?

Akhil marrige :  అక్కినేని నాగార్జున కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మెగాస్టార్, నందమూరి, సూపర్ స్టార్ క్రిష్ణ కుటుంబాల తర్వాత అక్కినేని నాగార్జున కుటుంబానికి కూడా అంతే క్రేజ్ ఉంది. దీని అంతటికి కారణం అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుకొచ్చుకుని… ఇప్పుడు అక్కినేని కుటుంబం కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

నాగార్జున సక్సెస్ అయినంత ఆయన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ సక్సెస్ కాలేకపోతున్నాడు. వరుసగా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ… మంచి సక్సెస్ అందుకోలేదు అక్కినేని అఖిల్. అయితే ఇలాంటి నేపథ్యంలో… అఖిల్ కు పెళ్లి చేస్తే… అతని కెరీర్ బాగుంటుందని నాగార్జున ఓ నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమలతో కూడా చర్చించారట నాగార్జున.

Akhil says NO to Nagarjuna!

- Advertisement -

మంచి సంబంధం వస్తే… అఖిల్ కు మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనుందట అక్కినేని కుటుంబం. కాగా అఖిల్ కి 2016లో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కారణం ఏమిటో కానీ వారి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక అఖిల్ మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేయలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాడు.

అఖిల్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. సాలిడ్ కమర్షియల్ హిట్ అయితే ఇంకా పడలేదు. అఖిల్ గత చిత్రం ఏజెంట్ దారుణ పరాజయం చవిచూసిందన్న సంగతి తెలిసిందే. దీంతో నెక్స్ట్ మూవీతో అయిన హిట్ కొట్టాలని అఖిల్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు