KajalAggarwal: కేక పెట్టిస్తున్న కాజ‌ల్ అందాలు…

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవడానికి ముందే కాజల్ మోడల్ గా ఫుల్ ఫేమస్ అయింది. ఆ సమయంలో నేను “లక్ష్మీ కళ్యాణం” అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటినుంచి ఈ అమ్మడు వెనుతిరిగి చూసుకోలేదు. వరుసహిట్లతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చాలా కాలంగా ఈ చిన్నది టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

దాదాపు పదేళ్లపాటు ఈ అమ్మడు ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఓ పండంటి బిడ్డకు తల్లి అయ్యింది. ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ ను పలకరిస్తోంది.

Kajal Aggarwal serves us double dose of denim but it comes with a unique fashion surprise

ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. వైట్ అండ్ బ్లూ కలర్ లాంగ్ స్కర్ట్ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో కాజల్ యమహాట్ గా కనిపిస్తోంది. ఒకప్పుడు కాజల్ ఎలా ఉండేదో మళ్లీ అదే అందం, ఫిట్నెస్ తో కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కాజల్ మళ్ళీ ఎప్పటిలాగే సినిమాల్లో రాణించాలని తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు