Shah Rukh Khan : షారుఖ్ వైద్య చరిత్ర… ఒళ్ళంతా గాయాలు, సర్జరిలే

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వడదెబ్బ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ షారుక్ ఖాన్ వైరల్ ఫీవర్ వల్ల హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని తెలిసింది. ప్రస్తుతం షారుక్ ఖాన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పటికే ఆయన ముంబై వెళ్లిపోయినట్లు సమాచారం.

షారూఖ్ క్షేమం..

ఐపీఎల్‌లో షారూఖ్ ఖాన్ కేకేఆర్ జట్టుకు సహ యజమాని. కేకేఆర్ ఈసారి ఫైనల్‌కు చేరుకుంది. షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ఫైనల్ చూడటానికి చెన్నై వెళ్తున్నాడు. ఆయన అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారనే వార్త తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే స్టార్స్ అనగానే వాళ్ళు అందుకునే కోట్ల రెమ్యూనరేషన్, లగ్జరీ లైఫ్ స్టైల్ కళ్ళ ముందు కదలాడుతుంది. కానీ వాళ్ళు సినిమాల కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ లో ఎన్నోసార్లు గాయాల పాలై కాళ్లూచేతులూ విరగ్గొట్టుకుంటారు. షారూఖ్ కు కూడా ఇలాగే జరిగింది.

- Advertisement -

షారుఖ్ వైద్య చరిత్ర

షారుక్ ఖాన్ వయసు ఇప్పుడు 58 ఏళ్లు. ఆయన ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. అతను ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే ఎన్నోసార్లు గాయపడినప్పటికి ఇంత హెల్దీగా ఉన్నారు. ఇక ఆయన గాయాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే…

9 Heart-Wrenching Moments When Shah Rukh Khan's Health Struggles Left Fans Praying For His Recovery

భుజం గాయం

‘రా వన్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాల షూటింగ్‌లో షారుఖ్ ఖాన్ భుజానికి గాయమైంది. ఆ తర్వాత అతనికి ఆపరేషన్ జరిగింది. అప్పుడు షారుఖ్ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నాడు.

మోకాలి గాయం

షారూఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా షూటింగ్‌లో షారుఖ్ మోకాలికి గాయమైంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ 5 స్టార్ హోటల్‌లో జరగ్గా, డ్యాన్స్ చేస్తూ కిందపడి గాయపడ్డాడు.

మోకాలి ఫ్రాక్చర్

షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా షూటింగులో మోకాలికి ఫ్రాక్చర్ అయింది.

భుజం ఆపరేషన్

2009లో షారూఖ్ ఖాన్ ఎడమ భుజానికి సర్జరీ జరిగింది. ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా విడుదలకు ముందే ఈ సర్జరీ జరిగింది.

బ్యాక్ సర్జరీ

‘కల్ హో నహో’ షూటింగ్ సమయంలో షారుఖ్‌కు వెన్ను నొప్పి తీవ్రతరం కావడంతో ఆయనకు సర్జరీ జరిగింది. అది కూడా జర్మనీలో. ఆ తర్వాత ఆయన సినిమాలకి లాంగ్ గ్యాప్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే నిర్మాతలు వెయిట్ చేసి సినిమాను తెరకెక్కించారు.

ఛాతిలో ఫ్రాక్చర్

‘డర్’ సినిమా షూటింగ్ సమయంలో షారుక్ ఖాన్ ఛాతిలో ఫ్రాక్చర్ అయింది.

మోకాలికి గాయం

రాకేష్ రోషన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘కోయిలా’ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ సమయంలో షారుక్ ఖాన్ మోకాలికి స్వల్ప గాయమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు