Deepika Padukone: దీపిక లేటెస్ట్ ఫోటోషూట్.. ప్రెగ్నెన్సీని దాచేస్తూ ఫొటోస్ వైరల్..!

దీపికా పదుకొనే.. బాలీవుడ్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన అందచందాలతో, నటనతో ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకుంటూనే ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా తన గ్లామరస్ ఫోటో షూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె అప్పుడప్పుడు బికినీ ఫోటోషూట్లతో కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఎప్పటిలాగే ఈసారి కూడా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది. ఇందులో ఎల్లో కలర్ అవుట్ ఫిట్ లో దేవకన్యలా మెరిసిపోతోంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రెగ్నెన్సీని దాచేస్తూ ఫొటోస్ వైరల్..

Deepika Padukone: Deepika's latest photo shoot.. Hiding the pregnancy, the photos are viral..!
Deepika Padukone: Deepika’s latest photo shoot.. Hiding the pregnancy, the photos are viral..!

ఇకపోతే దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ త్వరలోనే తమ మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కూడా. అయితే ఆ ప్రెగ్నెన్సీ ని దాచేస్తూ ఈ ఎల్లో కలర్ ఔట్ ఫిట్ లో ఫోటోలు షేర్ చేయడం ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ ఇందులో దీపికా పదుకొనే చాలా అందంగా ఉంది అని కామెంట్ లు చేస్తుంటే.. మరి కొంత మంది అసలు బేబీ బంప్ కనిపించకుండా ఈమె అలా ఎలా జాగ్రత్త పడింది అంటూ కామెంట్లో చేస్తున్నారు.. మొత్తానికైతే తన ప్రెగ్నెన్సీని దాచేస్తూ దీపికా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

సెప్టెంబర్ లో మొదటి బిడ్డకు ఆహ్వానం..

ఇకపోతే త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది దీపిక పదుకొనే. ఈ జంట ఫిబ్రవరి 29వ తేదీన ఇంస్టాగ్రామ్ లో తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నాము అంటూ ప్రకటించారు.. అంతేకాదు సెప్టెంబర్ లో తమ బిడ్డకు జన్మనిస్తున్నామని కూడా తెలిపారు..ప్రస్తుతం అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

దీపిక – రణబీర్ ప్రేమ, పెళ్లి..

దీపిక , రణబీర్ కపూర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2012లో వీరిద్దరు డేటింగ్ చేయడం మొదలుపెట్టారు.. 2015లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని.. 2018 లో కుటుంబ సభ్యుల సమక్షంలో.. ఇటలీలోని లేక్ కోమో లో వీరి వివాహం జరిగింది.. కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగిన విషయం తెలిసిందే.. వివాహం అనంతరం బెంగళూరు – ముంబై ప్రాంతాలలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు.. ఇక గత ఏడాది కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 8 లో పాల్గొన్న ఈ జంట వచ్చే ఏడాది తాము ఒక బిడ్డకు జన్మనిస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక అందులో భాగంగానే ఫిబ్రవరిలో ఆమె ప్రెగ్నెంట్ అయ్యానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది..

దీపికా పదుకొనే సినిమాలు..

ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. చివరిగా హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ సినిమాలో నటించిన ఈమె.. ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే చిత్రంలో నటిస్తోంది.. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.. అలాగే కమలహాసన్ , అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాల తర్వాత సింగం లో కూడా నటించనుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి ది ఇంటర్న్ హిందీ రీమేక్ లో నటించినున్నట్టు సమాచారం. ఇకపోతే పఠాన్ సినిమాలో బికినీలో నటించి విమర్శలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు