Sharwa36 : శర్వా సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రాజశేఖర్..?

Sharwa36 : టాలీవుడ్ లో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పిలిపించుకుంటూ అద్భుతమైన సినిమాలు చేసిన సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్. 20వ దశకం తర్వాత ఈ హీరోకి హిట్లు కరువయ్యాయి. చివరగా ఓ పదిహేనేళ్ల కిందట గోరింటాకు సినిమాతో హిట్ అందుకున్న రాజశేఖర్ ఆ తర్వాత హిట్ కాదు కదా, కనీసం యావరేజ్ సక్సెస్ కొట్టలేకపోయాడు. ఇక సీనియర్ హీరోలలో చాలా కాలంగా హిట్ కి దూరంగా వాళ్ళలో రాజశేఖర్ ఒకరు. మధ్యలో జియావో తీసుకుని ‘గురుడ వేగ’ సినిమాతో హీరోగా ట్రై చేసాడు. ఆ సినిమా యావరేజ్ గా మిగిలింది. పరిమితికి మించి బడ్జెట్ కావడంతో నష్టాలని మిగిల్చింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు ట్రై చేసినా కూడా ఏ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా శేఖర్ అనే సినిమాతో సక్సెస్ అందుకుంటాడేమో అనుకున్నా కూడా ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక లాస్ట్ ఇయర్ నితిన్ హీరోగా చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో చిన్న రోల్ లో నటించినా , అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి టైంలో రాజశేఖర్ శర్వానంద్ కొత్త సినిమాలో స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

Rajasekhar is getting a remuneration of 1.50 crores for the movie Sharwa36

శర్వా36 లో రాజశేఖర్..

ఇక శర్వానంద్ (Sharwa36) యువి క్రియేషన్స్ బ్యానర్ లో నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లో బైక్ రేసర్ గా శర్వానంద్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కీలక రోల్ లో రాజశేఖర్ నటించబోతున్నట్లు సమాచారం. చాలా టైంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ సినిమా ఆ కంబ్యాక్ ని ఇస్తుంది అన్న ఆశలు ఇప్పుడు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్ కి గాను రాజశేఖర్ కి సాలిడ్ రెమ్యునరేషన్ కూడా సొంతం కాబోతుందని సమాచారం. ఆల్ మోస్ట్ 1.50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఈ సినిమా కి గాను రాజశేఖర్ కి ఇవ్వనున్నట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

ఈ సినిమాతో అయినా కం బ్యాక్ ఇస్తాడా?

ఇక రాజశేఖర్ ఫామ్ లో లేక పోయినా కూడా ఇది సాలిడ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఒక స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతూ ఉండగా, యువి క్రియేషన్ మూవీ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లో అనిపించేలా ఉంటాయి. ఇక శర్వానంద్ తో రాజశేఖర్ చేస్తున్న ఈ సినిమాతో ఎంతవరకు ఇద్దరూ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి ఇక. ఇంతకు ముందు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో కీ రోల్ లో నటించినా అందులో పెద్దగా స్కోప్ లేదని తెలిసిందే. ఇప్పుడైనా బలమైన పాత్ర దొరికితే మళ్ళీ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే అప్పట్లో ధ్రువ లాంటి సినిమాల్లో విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో, అలాంటి పాత్రలు దొరికితే విలన్ గా చేయడానికి కూడా తాను రెడీ అని రాజశేఖర్ పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే. ఇక తన సహ హీరోలు అయిన శ్రీకాంత్, జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు గా సూపర్ ఫామ్ లో ఉన్నారు. తిరిగి వాళ్ళలా రాజశేఖర్ బిజీ అవుతాడా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు