Manushi Chillar: ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కి ఎవరైనా ఫిదా..?

Manushi Chillar.. మానుషీ చిల్లర్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రస్తుతం ఈమె వయసు 27 ఏళ్లు.. అయినా కూడా ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.. 12వ పరీక్షల్లో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి తన ప్రతిభను నిరూపించిన మానుషీ చిల్లర్ 2017 లో మిస్ వరల్డ్ టైటిల్ ని కూడా సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా తెచ్చిపెట్టింది. దీంతో 2017 లోనే ఫేమినా మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొని విజేతగా నిలిచింది.. ఈ బిరుదులతో.. కిరీటాన్ని తన తలకు అలంకరించుకున్న తర్వాత నటి కావాలని ఎన్నో కలలు కంది.. అందులో భాగంగానే బాలీవుడ్లో అడుగుపెట్టి రెండేళ్ల కెరియర్ లో నాలుగు ఈ సినిమాలలో హీరోయిన్ గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కానీ ఈ నాలుగు సినిమాలు కూడా అట్టర్ ప్లాఫ్ గా నిలిచాయి..

మానుషీ టాలెంట్ కి అందరూ ఫిదా..

Manushi Chillar: Does anyone care about this cutie's talent?
Manushi Chillar: Does anyone care about this cutie’s talent?

ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. చాలా ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చిన ఈమె.. తండ్రి డాక్టర్ మిత్ర వాసు చిల్లర్.. డి ఆర్ డి ఓ లో శాస్త్రవేత్త. దీంతోపాటు ఈమె తల్లి డాక్టర్ నీలం చిల్లర్ .. అసోసియేట్ ప్రొఫెసర్.. మానుషీకి చిన్నప్పటినుంచి చదువు అంటే చాలా ఇష్టం.. అందులో భాగంగానే 12వ పరీక్షలో సీబీఎస్సీ బోర్డులో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి రికార్డు సృష్టించింది. దీని తర్వాత నీట్ పరీక్షలో అర్హత సాధించిన ఈమె ఆ తర్వాత ఎంబిబిఎస్ పట్టా కూడా అందుకుంది.. చదువుతోపాటు అందాల పోటీల్లో కూడా విజేతగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.. మిస్ వరల్డ్ గా టైటిల్ గెల్చుకున్న మానుషీ రెండు సంవత్సరాల లో నాలుగు సినిమాలు చేసింది.. కానీ సినిమా ఇండస్ట్రీ ఈమెకు పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె విద్యా టాలెంట్ ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

మానుషీ సినిమాలు..

ఇకపోతే ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో ఈమె నాలుగు సినిమాలు చేసింది.. ఈ నాలుగు సినిమాల ఖర్చు రూ.650 కోట్లకు పైమాటే.. మానుషీ చిల్లర్ 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక తొలి చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా కనిపించాడు. రూ .250 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం చవి చూసింది .. దీని తర్వాత ఈమె విక్కీ కౌశల్ తో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమా కూడా చేసింది.. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. ఆ తర్వాత 2004లో ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా కూడా చేసింది.. ఈ సినిమా కూడా ఈమె కెరియర్ కు ఎటువంటి ఉపయోగాన్ని అందించలేదు. ఈ సినిమా కూడా పెద్ద ప్లాప్ గా నిలిచింది.. ఈ సినిమా తర్వాత బడే మియాన్ చోటే మియాన్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది.. ఇందులో టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ నటించగా.. వాసు భగ్నానీ ఈ సినిమాను నిర్మించారు.. ఇక బడ్జెట్ దాదాపు రూ.350 కోట్లకు పై మాటే.. మార్కెట్ విపరీతంగా జరిగింది కానీ సినిమా మాత్రం పెద్దగా వసూలు రాబట్టలేక ఫ్లాప్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు