Highest Collections: తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన మూవీస్ ఇవే..!

Highest Collections.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెడుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రీసెంట్ టైంలో పెద్ద సినిమాల మార్కెట్ మరింతగా పెరిగిపోయి సాలిడ్ గా గ్రాస్ కలెక్షన్స్ కూడా సొంతం అవుతున్నాయి బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మార్కెట్ భారీగా పెరిగిపోయింది.. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో పాటు కొన్ని రీజినల్ మూవీస్ కూడా సాలిడ్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నాయి.. అలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..

RRR – రూ.415 కోట్లు

బాహుబలి 2 – రూ.330 కోట్లు

- Advertisement -

సలార్ – రూ. 234.05 కోట్లు

అలవైకుంటపురంలో – రూ.203 కోట్లు

వాల్తేర్ వీరయ్య – రూ.186.65 కోట్లు

సరిలేరు నీకెవ్వరు – రూ.177.10 కోట్లు

బాహుబలి – రూ.175.40 కోట్లు

సైరా నరసింహారెడ్డి – రూ.168 కోట్లు

రంగస్థలం – రూ. 160 కోట్లు

హనుమాన్ – రూ.148.60 కోట్లు

గుంటూరు కారం – రూ.139.80 కోట్లు

కే జి ఎఫ్ చాప్టర్ 2 (డబ్) – రూ.136.05 కోట్లు

మహర్షి – రూ.131.60 కోట్లు

సర్కారు వారి పాట – రూ.136.05 కోట్లు

పుష్ప – రూ.131.50 కోట్లు

సాహో – రూ.126.50 కోట్లు

Highest Collections: These are the movies that collected the highest gross collection of all time..!
Highest Collections: These are the movies that collected the highest gross collection of all time..!

ఇలా మొత్తం మీద ఈ చిత్రాలన్నీ టాలీవుడ్ సినీ చరిత్రలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను అందుకున్న టాప్ చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇక 2024లో సెకండ్ హాఫ్ లో మరికొన్ని పెద్ద సినిమాలు మరింత మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు టాప్ స్టార్స్ మూవీ కూడా రానున్న సమయంలో ఈ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.. మరి ఈ లిస్టులోకి మరిన్ని సినిమాలు వచ్చి చేరుతాయో చూడాలి.. ఇకపోతే ఇప్పుడు త్వరలో రావాల్సిన బడా స్టార్స్ హీరోల సినిమాల విషయానికి వస్తే..

దేవర – ఎన్టీఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందరి దృష్టి ఎన్టీఆర్ పైనే.. ఈ క్రమంలోనే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్- రామ్ చరణ్ :

రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు.. ఈయన ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా కూడా దసరాకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కల్కి 2898 AD – ప్రభాస్:

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కూడా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.

వీటితోపాటు మరికొంతమంది బడా హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మరి ఈ చిత్రాలు ఈ టాప్ 10 చిత్రాల గ్రాస్ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు