Tollywood: ఈ వారం రిలీజయ్యే సినిమాలు.. ఒకటి తప్పుకుంది.

టాలీవుడ్ లో జూన్ నెలలో విడుదలైన సినిమాల్లో ఒక్క సినిమా కూడా సరైన విజయం నమోదు చేయలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ కూడా బెడిసి కొట్టింది. ఆ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో చాలా చిన్న సినిమాలు పోటీ ఎందుకని పోస్టుపోన్డ్ చేసుకున్నాయి. అందువల్ల ఈ వారం పెద్దగా హైప్ ఉన్న సినిమాలేవీ రాలేవు. వచ్చిన రెండు మూడు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలివ్వలేదు. ఇక జూన్ చివరి వారంలో దాదాపు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలేవో దేనికెంత ప్రాధాన్యత ఉందో చూద్దాం.

మొదటగా జూన్29న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా నిఖిల్ నటించిన “స్పై” రిలీజ్ అవుతుంది. గూఢచారి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే టైమ్ తక్కువ ఉండడంతో చిత్ర యూనిట్ ఇతర భాషల ప్రొమోషన్లలో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ ఆసక్తిని రేపుతున్న సినిమా “స్పై”.

ఇక స్పై తో పాటు రిలీజ్ అవుతున్న మరో సినిమా “సామజవరగమన“. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పూర్తి కామెడీ నేపథ్యంలో సాగుతుంది. కాబట్టి బీసీ సెంటర్ల ప్రేక్షకులని బాగా మెప్పించవచ్చు. ఈ సినిమాకి కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. స్పై యాక్షన్ జోనర్ సినిమా అవడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలతో పాటు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 7:11PM సినిమా కూడా 29న విడుదల కావాల్సింది. కానీ థియేటర్ల కొరత వలన జులై 7కి పోస్టుపోన్డ్ అయ్యింది.

- Advertisement -

ఇక ఇవే గాక జూన్ 30న మాయాపేటిక, లవ్ యు రామ్, నారాయణ&కో అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో మాయాపేటిక కొంచెం బెటర్ ఆప్షన్ గా మారనుంది. సునీల్, పాయల్ రాజపుత్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఆ సినిమా, కామెడీ నేపథ్యంలో వస్తున్నందున ప్రేక్షకులని మెప్పించే ఛాన్స్ ఉంది. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో ఎన్ని హిట్ అవుతాయో, అసలు ఈ నెల ఫస్ట్ హిట్ పడుతుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు