Prabhas : అసలు కమల్ హాసన్ ప్రాజెక్ట్ -కే సినిమాలో ఉన్నాడా..లేడా ? ఇదిగోండి క్లారిటీ ..

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమా  గురించి అందరికి తెల్సిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంకాంత్రి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కించబడుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మహానటి సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన ప్రతిభ ఏంటో నిరూపించుకోవడంతో ఈ సినిమాపై సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసారు మూవీ యూనిట్.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకునే నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దిశా పటని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

- Advertisement -

అదేంటంటే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడని, నిజానికి ఈ రూమర్ చాలా రోజుల క్రితమే వచ్చిన, ప్రాజెక్ట్-కే మూవీ యూనిట్ దీనిపై ఏ విధంగానూ స్పందించకపోవడంతో, అందరిలో కన్ఫ్యూజన్ మొదలైంది. అయితే ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఈరోజు ఇవ్వనున్ననట్టు టాక్.

విశ్వసనీయ సమాచారం ప్రకారం కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ ఓకె చెప్పాడట. దాదాపు 4 వారాల పాటు డేట్స్ కూడా కేటాయించినట్టు తెల్సుతోంది. అయితే మొదట్లో ఈ విషయం అందరికి సర్ప్రైజ్ గా ఉండాలని చాలా రోజుల పాటు గోప్యాంగ ఉంచగా, ఇటీవలనే ఈ విషయం అందరికి తెలియటంతో ఈ న్యూస్ పై ఆఫిషియల్  ఎనౌన్స్ మెంట్ ఈరోజు చేయనున్నారు

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు