Mega Princess: ఉపాసనకు విష్ చేస్తూ ఆ హీరోయిన్ ఏమందంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 20న తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. మంగళవారం రోజు తెల్లవారుజామున ఒంటి గంట నలభై నిమిశాలకు ఆ పాప పుట్టింది. ఈ విషయం తెలియగానే మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. పాప పుట్టాగానే మెగా ప్రిన్సెస్ ని చూడడానికి ఫ్యామిలీ మొత్తం అపోలో కి వచ్చేసారు. ఇక సెలెబెట్రీ లు కూడా తమ తమ సోషల్ మీడియా పేజీల్లో విష్ చేసారు. కాగా బిడ్డ పుట్టిన మూడు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన, రామ్ చరణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.

అక్కడ పాపతో కలిసి తొలి ఫోటో తీసుకుని సోషల్ మీడియా లో తమ ఆనందాన్ని పంచుకున్నారు రామ్ చరణ్, ఉపాసన. అయితే వీరిని ట్యాగ్ చేస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఉపాసన ఇంస్టాగ్రామ్ పేజీ లో కామెంట్ ద్వారా ఈ విధంగా తన విషెస్ తెలిపింది.

కాంగ్రాట్యులేషన్స్ ఉప్సి… మీ ఆనందం పదింతలు కావాలని కోరుకుంటున్నాను. అలాగే పాపకి ప్రపంచంలోని అందరి దేవుళ్ళ ఆశీస్సులు కలగాలని, అన్ని సంతోషాలు పొందాలని ఆశిస్తున్నాను అని చెప్పింది.

- Advertisement -

ఇక ఉపాసన కి క్లోజ్ గా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరని అందరికి తెలిసిందే. గతంలో ఇంస్టాగ్రామ్ వేదికగా వీళ్లిద్దరు కలిసి పలు హెల్త్ టిప్స్ ను ప్రమోట్ చేయడం జరిగింది. ఇక పలు ఫంక్షన్లలోనూ ఉపాసన తో కలిసి రకుల్ ప్రీత్ సందడి చేయడం కూడా చూసాం. ఇక ఉపాసన కొణిదల అప్లోడ్ చేసిన ఆ ఫోటోలో రకులే కాక ప్రియాంక చోప్రా, సుశాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కూడా విష్ చేయడం జరిగింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు