UBS: స్టార్ హీరోయిన్ నుంచి, ఐటెం గర్ల్ స్థాయికి పడిపోయిన పూజా హెగ్డే

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ట్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉండే పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలేవీ లేక అయోమయంలో పడిపోయింది. గత కొద్దీ రోజుల క్రితం దాక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా అయిన చేతిలో ఉందనుకుంటే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది.

పూజా హెగ్డే కి గత కొద్దీ కాలంగా చేస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలుస్తుండటంతో ఈమెకి సినిమా అవకాశాలు రావడం లేదనేది ఒక కారణం అయితే. మరో కారణం పూజా హెగ్డే రెమ్యునరేషన్. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో పని చేసే అవకాశం రావడంతో పూజా హెగ్డే సినిమా, సినిమాకి రెమ్యునరేషన్ హైక్ చేస్తూ వచ్చింది. అయితే కెరీర్ మంచి ఫ్లోలో ఉంటడం, స్టార్ట్ హీరోలతో పని చేస్తుండటం మూలాన ఆమె అడిగినంత మొత్తం నిర్మాతలు ఆమె చేతిలో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేకపోయేసరికి పూజా హెగ్డే తన రెమ్యునరేష్ కూడా తగ్గిందని టాక్.

ప్రస్తుతం పూజా హెగ్డేని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగినట్టు సమాచారం. అసలే సినిమాలు కూడా ఏవి రాకపోవడంతో పూజా హెగ్డే ఐటెం సాంగ్ కి కూడా ఒకే చెప్పేసిందట. గతంలో రంగస్థలం,f3 సినిమాలలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ భామ ఒక్కో సాంగ్ కి గాను 2-4కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుందట. అయితే ఇప్పుడు మాత్రం 70 లక్షలు ఇచ్చిన కూడా ఆమె ఐటెం సాంగ్ చేయడానికి ఒకే చెప్పేస్తుందట. పూజా హెగ్డే నటించిన సినిమాల కంటే ఐటెం సాంగ్ చేసిన సినిమాలే ఎక్కువ విజయం సాధించటంతో పూజా హెగ్డేని నిర్మాతలు హీరోయిన్ గా తీసుకోవడం కంటే కూడా ఐటెం సాంగ్ లకు తీసుకోడానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు