LIGER TRAILER : క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం “లైగర్”. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ చాలానే కష్టపడ్డాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ లో విజయ్ మేకోవర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే “లైగర్” సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ రోజు గురువారం ఉదయం 9:30 గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ లో ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో విజువల్ యాక్షన్ ఫీట్స్ అదిరిపోయాయి అంటున్నారు అభిమానులు. విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ పాత్రను ఎంట్రీ లోనే చూపించి సర్ప్రైజ్ చేశాడు పూరీ జగన్నాథ్.

రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవ్వగానే “ఒక లయన్ కి, టైగర్ కి పుట్టి ఉండాడు సార్ నా బిడ్డ, క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఒక సాధారణ కుర్రాడు బాక్సింగ్ లో ఛాంపియన్ ఎలా అయ్యాడు అన్నదే ఈ కథ. ట్రైలర్ చివరిలో మైక్ టైసన్ ఎంట్రీని విజయ్ దేవరకొండ డైలాగ్ కి అటాచ్ చేస్తూ, ఐ యాం ఏ ఫైటర్ అని విజయ్ అంటే మరి నేనెవర్ని అనే డైలాగ్ తో కౌబాయ్ గెటప్ లో మైక్ టైసన్ ని కొత్తగా చూపించాడు.

- Advertisement -

మైక్ టైసన్ ఒక్క డైలాగుతోనే ముగించేశాడు పూరి. ఈ సినిమాలో విజయ్ కి నత్తి అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లోనూ అదే చూపించి ఆడియన్స్ ను ప్రిపేర్ చేసేసాడు పూరి. కాగా ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు