Sita Ramam : సీతారామంలో మరో స్టార్ నటి

యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర ఫస్ట్ లుక్ ను వినూత్నంగా విడుదల చేసి, ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

ఇప్పటి వరకు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ భాస్కర్ ఫస్ట్ లుక్ లను విడుదల చేశారు. అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. సీతారామం సినిమాలో మృణాళిని పాత్రలో భూమిక చావ్లా కనిపించబోతుంది.

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో భూమిక ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటుంది. చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో భూమిక కనిపించనున్నారు. కాగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు