అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం “థాంక్యూ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే విభిన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించడంలో ముందుండే నటుల్లో ఒకరైన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ “లాల్ సింగ్ చడ్డా”. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. అద్వైత్ చెందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. “లాల్ సింగ్ చెడ్డా” ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలోనూ విడుదల చేస్తున్నారు. తెలుగులో చిరంజీవి లాల్ సింగ్ చడ్డా ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి నివాసంలో లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య లుక్ ను కూడా రివీల్ చేశారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి చైతు లుక్ ని రిలీజ్ చేశారు. “లాల్ సింగ్ చడ్డా చెడ్డి బడ్డి ‘బాలరాజు’ ను మీకు పరిచయం చేస్తున్నా, అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన నాగచైతన్యనే ఈ బాలరాజు”అని పేర్కొన్నారు.
Read More: Sharwanand: తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్..!
ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ నాగచైతన్య మరో ట్వీట్ చేశారు. ‘లాల్ సింగ్ చెడ్డా ఇది నాతో ఎప్పటికీ ఉండిపోతుంది’ అని చెప్పాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను.
Read More: Adipurush: రిలీజ్‌కి ముందు అండగా ఉన్నవాళ్ల నుంచే… ఇప్పుడు బ్యాన్ డిమాండ్
అలనాటి ‘బాలరాజు’ మనవడు మన
అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు. @chay_akkineniIntroducing #Balaraju
from #LaalSinghChaddha #AamirKhan @AKPPL_Official @Viacom18Studios #LaalSinghChaddhaOnAUG11th pic.twitter.com/1cVgbURrZx— Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...