Bimbisara2: కళ్యాణ్ రామ్ లేటెస్ట్ అప్డేట్..

గత కొన్నేళ్లుగా నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలని ప్లాప్ అవుతున్నాయి. కొత్త కొత్త కథలు ఎంచుకున్నప్పటకీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ అవలేకపోతున్నాయి. గతేడాది రిలీజ్ అయిన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ను తెచ్చి పెట్టింది. ఈ మూవీ సక్సెస్ తో అమిగోస్ అనే మరో కొత్త కాన్సెప్ట్ తో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు ఈ నందమూరి హీరో.

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న అమిగోస్ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అవనుంది. ఈ చిత్రంలో మూడు పాత్రలతో సందడి చేయబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు రవీంద్ర రెడ్డి. అనికా రంగనాథ్ అనే హీరోయిన్ నందమూరి వారసుడికి జోడిగా నటించారు. ఈ రోజు జరిగిన ఈ చిత్ర ప్రెస్ మీట్ లో బింబిసార సినిమా గురంచి కొని ఇంపార్టెంట్ డౌట్స్ ను క్లియర్ చేసారు కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ ను మళ్ళి దారిలో పెట్టిన చిత్రం బింబిసారకు సీక్వెల్ ఉంటుందని మూవీ టీం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి కళ్యాణ్ రామ్ అసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు. బింబిసార 2ను ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తామని అనౌన్స్ చేశాడు. కాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ తర్వాత డెవిల్ సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రం ఇప్పటికే కొంత వరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

- Advertisement -

డెవిల్ మూవీ పూర్తి అయిన వెంటనే బింబిసార2 స్టార్ట్ కానుందని తెలుస్తుంది. కాగా ఈ మధ్య కాలంలో బింబిసార 2 ఉండదని, ఒక వేళ ఉన్నా.. దానికి డైరెక్టర్ గా మల్లిడి వశిష్ట్ ఉండడని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసార 2 పై అప్డేట్ ఇవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం Filmify ను ఫాలో అవండి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు