LEO: లోకి యూనివర్స్ లోకి మెగా పవర్ స్టార్ ?

యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు వరుస సినిమాలు తీస్తూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. భారత చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నపేరు లోకి సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటికే ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలు వచ్చాయి. కార్తీ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచిన చిత్రం “ఖైదీ”. అలాగే “విక్రమ్” సినిమా తో కమల్ హాసన్ కు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ను అందింది.

ఈ సినిమాల కథలు ఒకదానికి మరోకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండు సినిమాలు లోకేష్ కనగరాజ్ లోకి యూనివర్స్ లో భాగమే. ఇక ముందు ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఖైదీ 2 తో పాటు విక్రమ్ సీక్వెల్ రాబోతున్నాయి. వీటి ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించిన తర్వాత, ఆయన నుంచి నుంచి వచ్చే సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

లోకేష్ చేసేది లోకిలో భాగామా ? కాదా ? అనే డౌట్ తో పాటు.. చేసిన సినిమాల్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో లోకేష్ సినిమాలంటే.. ప్రేక్షకులకు అసక్తి ఎక్కువగానే ఉంది. అందుకే ఆయన సినిమా అనౌన్స్ అంటే పాన్ ఇండియా స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంది. తాజాగా ఈ క్రియేటివ్ డైరెక్టర్ విజయ్ తలపతితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి లియో అనే టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేశారు చిత్ర బృందం.

- Advertisement -

అయితే ఈ సినిమా లోకి యూనివర్స్ లో భాగమే అని వార్తలు వస్తున్నాయి. అందుకోసం లోకేష్ కనగరాజ్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ యూనివర్స్ లో భాగం చేయడానికి లియోలో స్టార్ హీరోలను దింపుతున్నాడట. బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్, కోలీవుడ్ నుంచి చియాన్ విక్రమ్ ను సంప్రదిస్తున్నట్టు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ను కూడా ఈ యూనివర్స్ లో భాగం చేయడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథపరమైన చర్చలు కూడా జరగాయని, లియో, లోకి యూనివర్స్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ ఇక ఫుల్ ట్రీట్ ఉండటం ఖాయం.

అయితే ఈ న్యూస్ పై ఇప్పటి వరకు ఇటు రామ్ చరణ్ గానీ, అటు లియో టీం గానీ అధికారికంగా ప్రకటించలేదు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు