NTR Death Anniversary : ఎన్టీఆర్ ను కాలితో తన్నిన జమున… ఆయన రియాక్షన్ ఏంటంటే?

నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక సోషల్ మీడియా వేదికగా తారక రామారావు అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాముడిగా, కృష్ణుడిగా ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయుడైన ఎన్టీఆర్ ను ఒకానొక సమయంలో అలనాటి హీరోయిన్ జమున కాలితో తన్నారట. అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటంటే….

తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి తారల్లో సత్యభామగా పేరు తెచ్చుకున్న నటి జమున ఒకరు. ప్రస్తుతం ఆమె మన మధ్యన లేకపోయినా అప్పట్లో గడుసు పాత్రలు అనగానే జమున గుర్తొచ్చేది. అమాయకత్వం, అల్లరి కలగలిసిన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జమున. అయితే అప్పట్లో “శ్రీకృష్ణ తులాభారం” అనే సినిమాలో జమున సత్యభామ పాత్రలో నటించి మెప్పించింది. అప్పటి జనం సత్యభామగా జమునను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేరు అన్నంతగా ఒదిగిపోయింది.

అయితే అదే సమయంలో చాలా సినిమాల్లో జమునకు సత్యభామగా నటించే అవకాశం దక్కింది. ఆమె సత్యభామగా నటించిన మొదటి చిత్రం “వినాయక చవితి”. ఇక శ్రీకృష్ణతులాభారం సమయంలో జమునపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారట. దానికి కారణం ఆమె ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు దేవుడిగా కొలిచే ఎన్టీఆర్ ను కాలితో తన్నడమే. సినిమాలో భాగంగానే ఆమె ఆ సన్నివేశాన్ని చేసినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు దాన్ని జీర్ణిచుకోలేకపోయారు.

- Advertisement -

శ్రీకృష్ణతులాభారం సినిమాలో సత్యభామ గా నటించిన జమున ఓ పాటలో భాగంగా శ్రీకృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ను తన్నాల్సి వచ్చింది. సినిమాలో సత్యభామగా తాను అలిగినప్పుడు, కాలితో శ్రీకృష్ణుని పాత్రలో నటించిన ఎన్టీఆర్ తలపై ఉన్న కిరీటాన్ని తంతుంది. అయితే సినిమాలో భాగంగానే జమున ఈ సన్నివేశాన్ని చేసినప్పటికీ తనకు నచ్చలేదట. అయిష్టంగానే ఆ సీన్ చేసిందట. తను కృష్ణుడికి పెద్ద భక్తురాలు కావడంతో పాటు కృష్ణుడి పాత్రలో నటించిన ఎన్టీఆర్ ను కాలితో తన్నడం వల్ల ఆ సీన్ చేసిన తర్వాత మనసంతా పాడైపోయిందని ఒకానొక సందర్భంలో జమున స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక సీన్ అయిపోయాక జమున ఎన్టీఆర్ తో సారీ సార్ అని చెప్పిందట.

ఎన్టీఆర్ ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటూ ఇట్స్ ఆల్ రైట్, ఆల్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అంటూ నవ్వేసారట. ఇక ఈ సీన్ వల్ల ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం కావడంతో పాటు జమునపై ఫైర్ అయ్యారు. తాను పాత్ర కోసమే అలా చేసినట్టు జమున వివరణ ఇచ్చుకున్న తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు జమున కూడా మన మధ్యన లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన ఈ విషయాన్ని అభిమానులు ఇంకా నెమరు వేసుకుంటున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు