Naa Saami Ranga : లాభాల్లోకి “నా సామి రంగ”… నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే

సంక్రాంతికి “నా సామి రంగ” అనే కలర్ ఫుల్ మూవీతో ప్రేక్షకులను అలరించి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు నాగార్జున. మరి ఈ నాలుగు రోజుల్లో “నా సామి రంగ” మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు రీచ్ అవ్వాలి అంటే నాగ్ మూవీ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? అనే వివరాల్లోకి వెళితే…

కింగ్ నాగార్జున, కన్నడ భామ ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ “నా సామి రంగ”. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన ఈ పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. సంక్రాంతి సెలవులు పూర్తయ్యాక కూడా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా సినిమాలకు వీకెండ్ కలెక్షన్స్ బాగుంటాయి. ఒక్కసారి వీకెండ్ కంప్లీట్ అయితే తర్వాత జోరు తగ్గిపోతుంది. ఫలితంగా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి.

కానీ ఆదివారం విడుదలైన “నా సామి రంగ” సినిమాకు వీక్ డేస్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా రిలీజ్ అయి మూడు నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్ ఏమి కనిపించకపోవడం విశేషం. ఇక ఇప్పటికే ఈ సినిమా గుంటూరు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తీసుకొచ్చే దిశగా పరుగులు తీస్తోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడంతో ఐదవ రోజు నుంచే వచ్చే వసూళ్లు అన్ని ఈ డిస్ట్రిబ్యూటర్ల లాభాల ఖాతాలోకి వెళ్తాయి. మిగతా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.

- Advertisement -

“నా సామి రంగ” మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 15.63 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 30.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజులు 8.8 కోట్ల షేర్, మూడవరోజు 3.58 కోట్ల షేర్, నాలుగవ రోజు 3.17 కోట్ల షేర్ కలెక్షన్స్ ను “నా సామి రంగ” రాబట్టుకుంది. ఏరియాల వారీగా నాలుగవ రోజు ఎక్కడ ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అంటే… నైజాం – రూ.85 లక్షలు, గుంటూరు – 31 లక్షలు, సీడెడ్ – రూ.51 లక్షలు, కృష్ణ – రూ. 23 లక్షలు, విశాఖ – రూ. 47 లక్షలు, నెల్లూరు – రూ. 17 లక్షలు, వెస్ట్ గోదావరి – రూ. 21 లక్షలు, ఈస్ట్ గోదావరి – రూ. 42 లక్షలు. “నా సామి రంగ” మూవీ థియేట్రికల్ రైట్స్ 18.5 కోట్లకు అమ్ముడు పోగా, ఇప్పటికే 15.63 కోట్ల షేర్ వచ్చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ రీచ్ కాబోతున్న రెండో సినిమా ఇదే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు