Sai Dharam Tej : హస్బెండ్ మెటీరియల్… తేజ్ మాయలో పడిపోయిన మరో హీరోయిన్

ప్రస్తుతం పెళ్లి కాకుండా ఉన్న మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈ హీరో మాయలో హీరోయిన్లు ఈజీగా పడిపోతున్నారు. ఫలితంగా తేజ్ కి హస్బెండ్ మెటీరియల్ అంటూ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ సాయి ధరం తేజ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో స్టార్ హీరోలుగా నిలదొక్కుకుంది మాత్రం కొంతమందే. ఆ కొంతమందిలోనే ఒకరు సుప్రీం హీరో సాయి ధరం తేజ్. కూల్ గా కనిపించే ఈ యంగ్ హీరో తనతోపాటు కలిసి సినిమాలు చేసే హీరోయిన్లకు తెగ నచ్చేస్తున్నాడు. ఇప్పటికే తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి ట్యాగ్ ఇచ్చేసింది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి ఈ కామెంట్స్ చేసింది. తాజాగా ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ కేతిక శర్మ కూడా చేరిపోయింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కేతిక శర్మ మెగా బ్రదర్స్ సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ ఇద్దరు అన్నదమ్ములతో కలిసి కేతికా శర్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ భామకు సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ లలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు అనే ప్రశ్న ఎదురు కాగా, సాయి ధరమ్ తేజ్ అంటూ ఠక్కున సమాధానం ఇచ్చేసింది. నిజానికి ఇద్దరు మెగా బ్రదర్స్ చాలా స్వీట్ అని, ఇద్దరికీ కూడా తాను క్లోజ్ అని చెప్పుకొచ్చింది. వైష్ణవ్ తేజ్, తను చిన్నపిల్లల్లాగా కొట్టుకుంటామని, సాయి ధరమ్ తేజ్ తో అయితే ముఖ్యమైన విషయాలను కూడా షేర్ చేసుకుంటానని చెప్పి ఈ మెగా బ్రదర్స్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టింది.

అయితే సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన హీరోయిన్లందరూ ఇతన్ని హస్బెండ్ మెటీరియల్ అని చెప్పడం విశేషం. కాగా యాక్సిడెంట్ తర్వాత కోలుకుని గత ఏడాది “విరూపాక్ష” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం మరో సినిమాకు కమిట్ అయ్యాడు. డైరెక్టర్ సంపత్ నందితో కలిసి “గాంజా శంకర్” అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తుండగా, ఇప్పటికే దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు