Personality Development : ప్రతిరోజూ సంతోషంగా ఉండాలంటే ఉదయాన్నే ఈ టిప్స్ పాటించండి

ప్రతిరోజూ ఉదయం లేవగానే మనం చేసే పనులే ఆ రోజు మొత్తం మనం ఎలా ఉంటాము అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ డల్ గా నిద్రలేస్తే ఆ రోజంతా నిదానంగా గడవడమే కాకుండా ఏ పని చేయబుద్ధి కాదు. కానీ కొన్ని రకాల అలవాట్లను అలవర్చుకుంటే ప్రతి రోజూ ఉదయం ప్రశాంతంగా నిద్రలేస్తారు. దానివల్ల ఆ రోజంతా సంతోషంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు. అలాగని ఉదయాన్నే నాలుగు గంటలకు లేవాల్సిన అవసరం లేదు. గంటల తరబడి వ్యాయామం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. మరి ఉదయాన్నే సరైన మార్గంలో డేను స్టార్ట్ చేసే ఆ అలవాట్లు ఏంటి? అంటే…

1. హైడ్రేషన్
హైడ్రేషన్ అనేది శరీరానికి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది కేవలం శరీరానికే కాదు మానసిక స్థితికి కూడా గేమ్ చేంజర్ లాంటిది. చాలామంది రాత్రంతా బాగా నిద్రపోయి ఉదయాన్నే డిహైడ్రేషన్ తో మేల్కొంటారు. దీనివల్ల పొద్దున్నే అలసటగా, డల్ గా అనిపించడం జరుగుతుంది. అందుకే లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగి డే ను స్టార్ట్ చేయండి. నిద్ర లేవగానే వాటర్ తాగడం వల్ల మీ శరీరం రీహైడ్రేట్ అవ్వడమే కాకుండా జీవక్రియ మెరుగుపడుతుంది. తద్వారా ఉత్సాహంగా ఆ రోజంతా గడుపుతారు. వాటర్ తాగలేని వాళ్లు హెర్బల్ టీ ని కూడా తాగొచ్చు.

2. ధ్యానం చేయండి
ప్రతిరోజు ఉదయం కేవలం ఐదు నిమిషాలు కూర్చుని మీ శ్వాస పై దృష్టి పెట్టడం వల్ల ఆ రోజు ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ మీ శ్వాసపై దృష్టి పెట్టండి.

- Advertisement -

3. వ్యాయామం
ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. మెదడులో సాధారణంగా సహజంగా నొప్పి నివారణగా పని చేసే ఈ హార్మోన్ విడుదలవడం వల్ల మూడ్ సెట్ అవుతుంది. కేవలం కొన్ని నిమిషాల శారీరక శ్రమ వల్ల మీ మానసిక స్థితి మొత్తం ఉల్లాసంగా మారిపోతుంది.

4. ఆరోగ్యకరమైన అల్పాహారం
బ్రేక్ ఫాస్ట్ అనగానే ఏవేవో వంటకాలు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. పోషకాలతో నిండి ఉన్న అల్పాహారం ఏదైనా మంచిదే. ఫ్రూట్స్ కలిపిన ఓట్ మీల్, ఆకుకూరలతో చేసిన స్మూతీ, లేదంటే అవకాడో టోస్ట్ కూడా ఆరోగ్యానికి మంచివే. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అంటే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ముఖ్యమని గుర్తు పెట్టుకోండి.

5. ఈ అలవాట్లతో పాటు ఉత్తేజకరమైన సంగీతం లేదా పాడ్ కాస్ట్ లను వినడం, ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ లను చూడడం తగ్గించడం, కాస్త ముందుగా లేచి ఈరోజు చేయాలనుకుంటున్న పనులను ప్లాన్ చేసుకోవడం, సెల్ఫ్ కేర్ పై దృష్టి పెట్టడం వంటి అలవాట్లు చేసుకుంటే రోజును ఎనర్జిటిక్ గా స్టార్ట్ చేయగలుగుతాం. చురుగ్గా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతాం. కాబట్టి సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ అలవాట్లను అలవాటు చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు