అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్
కేవలం కామెడీ సినిమాలకు మాత్రమే అనుకుంటే పొరపాటే,
కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయడంలో కూడా ముందుంటాడు.
అల్లరి నరేష్ సినిమాలు అంటే హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ ఉంటాయి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
అల్లరి సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఈ తరం హీరోలలో ఎక్కువ సినిమాలు చేసారు,
కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో గుర్తుండే పాత్రలను చేసారు నరేష్ గమ్యం సినిమాలో గాలి శీను పాత్ర ఇప్పటికి కంటతడి పెట్టిస్తుంది.
అటువంటి తరహాలో చేసిన శంభో శివ శంభో , మహర్షి సినిమాలు కూడా. నరేష్ గతంలో నేను,ప్రాణం, విశాఖ ఎక్సప్రెస్ వంటి సినిమాలలో సీరియలస్ రోల్స్ కూడా చేసారు.
Read More: Nanī : ఎన్టీఆర్ రికార్డుకు ఎసరు !
అల్లరి నరేష్ నాంది సినిమాతో మరోసారి పూర్తి స్థాయి సీరియస్ రోల్ పోషించాడు. ఈ సినిమాలో నరేష్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఈ క్రమంలోనే నరేష్ మరో సిరీయస్ పాత్రలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాను చేస్తున్నాడు. రాజ్‌మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకులలో ఆసక్తిని నింపారు. ఈ పోస్టర్‌లో నరేష్ మంచం కాలు పట్టుకుని ఎవర్నో కోల్పోయినట్టు బాధతో చూస్తున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే నరేష్ మరో ఫుల్ లెంగ్త్ సీరియస్ పాత్రలో కనిపిస్తారు అని అర్ధమవుతుంది. నరేష్‌కు జోడీగా బస్‌స్టాప్ ఫేం ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read More: Pushpa-2 : ఒకే సెట్ లో బన్నీ-సుక్కు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...