అఖిల్ ఆగాడండోయ్..?

అక్కినేని అఖిల్ తొలి సారి రా ఏజెంట్ గా కనిపిస్తున్న సినిమా ఏజెంట్. స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ మూవీరి స్టోరీని అందిస్తున్నాడు. హీరోయిన్ గా సాక్సి వైద్య, కీలక పాత్రలో ముమ్ముట్టి నటిస్తున్నారు. కాగ ఇప్పటి వరకు లవర్ బాయ్, కూల్ గా ఉండే పాత్రల్లో నటించిన అఖిల్ తొలి స్పై థ్రిల్లర్ మూవీస్ చేయడంతో కొంత వరకు అంచనాలు పెరిగాయి. అలాగే ఈ సినిమా కోసం అఖిల్ నరాలు కూడా బలంగా ఉండేలా.. బాడీని పెంచుకున్నాడు. 

అయితే ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 12న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించింది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయాలా.. వద్దా అనే డైలామో ఉన్నట్టు సమాచారం. 

ఎందుకంటే.. ఆగస్టు బరిలో ఇప్పటికే అఖిల్ అన్న.. నాగ చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా తో పాటు సమంత లేడి ఓరియేంటెడ్ యశోద సినిమా ఉంది. అలాగే..  మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా ఆగస్టు 12నే రిలీజ్ కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

- Advertisement -

మెగాస్టార్ తో పాటు నాగ చైతన్య, సమంత సినిమాలు ఉండటంతో అఖిల్ వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగ మెగా స్టార్ కోసం, అన్న వదిన కోసం అఖిల్ సైడ్ అవుతున్నాడని నెటిజన్లు అంటున్నారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు