మాములుగా వయసు పెరిగితే అనుభవం పెరుగుతుంది అంటారు,
అదే వయసు ముదిరి ముసలివాళ్ళు అయిపోతే కొందరికి చాదస్తం పెరుగుతుంది. తెలుగు సినిమాలో ఒక విలక్షణమైన నటుడు ఆయన.
ఏ పాత్రలో అయిన పరకాయప్రవేశం చేసే సామర్ధ్యం ఆయనది.
ఒకటి రెండు కాదు ఎన్నో గుర్తుండే పాత్రలు, ఎప్పటికి మర్చిపోలేను కొన్ని డైలాగ్స్ , చరిత్రలో నిలిచిపోయే కొన్ని సినిమాలు. ఇది ఒకప్పుడు కోట శ్రీనివాస్ రావు పై అభిప్రాయం.
ఆ అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది చాలామందికి.
ఎన్ని ఉన్నా ఏమి లాభం నోటిని అదుపులో పెట్టుకోకుండా అవతలవాళ్ళను తక్కువ చేసి మాట్లాడినప్పుడు. మాములుగా అభిప్రాయాలు చెప్పడం వేరు, ఆ అభిప్రాయాలను అవతలపై రుద్దడం వేరు. సరిగ్గా ప్రస్తుతం కోట అదే చేస్తున్నారు ప్రతి ఒక్కరిని తీసి పడేస్తున్నారు.
రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా హీరో చిరంజీవిపై దారుణమైన వ్యాఖ్యలు చేసారు కోట. రామ్ చరణ్ గురించి కూడా నెగెటివ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
చిరంజీవి సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కడతానంటే దాన్ని తప్పుబడుతూ ఆసుపత్రి ఎందుకు ముందు ఫుడ్డు పెట్టు అన్నారు.
మే డే వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా చిరు మాట్లాడుతూ తాను సినీ కార్మికుడిని అంటే.. నువ్వు కార్మికుడివి ఎట్లా అవుతావు , కోట్లు తీసుకుని సినిమా చేసే కాస్టలీ కార్మికుడివి అనే వాడిని నేను ఎదురుగా ఉంటే అని చెప్పుకొచ్చాడు.
ఇక ‘రంగస్థలం’ సినిమాలో అంత గొప్పగా నటించిన రామ్ చరణ్‌ను మంచి నటుడు కాదు, చిరంజీవి కొడుకు కాబట్టి అంత పేరు వచ్చేసింది, పొటెన్షియాలిటీ కనిపించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ ఏజ్ లో కృష్ణ రామ అని తలుచుకోకుండా చిరంజీవి , రాంచరణ్ అంటూ దూషణలు ఏంటో కోట కే తెలియాలి.