అన్ని పనులు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా.. వరుస విజయాలతో ఫుల్ జోష్ పై ఉన్న ఎస్ ఎస్ థమన్ ఉన్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీటితో పాటు మూవీ టీం ప్రతి రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కు మరింత ఉత్కంఠ రేపుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కూడా ప్రతి రోజు ట్వీట్స్ చేస్తూ.. సినిమా పై క్రేజ్ ను పెంచుతున్నాడు. తాజా గా ఈ రోజు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ గురించి థమన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
Read More: Anasuya : ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ మూవీలో థమన్ అందించిన అన్ని కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. వీటిలో సరాసరా సరా సరా సర్కారు వారి పాట.. అంటూ సాగే టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ కు ఓ ర్యాప్ వర్షన్ కూడా రాబోతుందని థమన్ ట్వీట్ చేశాడు. ఇది సినిమాకే హైలైట్ గా ఉంటుందట. ఈ పాటకు బీజేఎంతో డాల్బీ మిక్సింగ్ కూడా ఉంటుందని తెలిపాడు.
అయితే ఇప్పటికే సర్కారు వారి పాట సాంగ్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇప్పుడు థమన్ ఇచ్చే అదనపు హంగుల ర్యాప్ వర్షన్ సాంగ్ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంటుంది.
Read More: Kalyan Ram: అమిగోస్ మొదటి రోజు కలెక్షన్లు
#SuperStar’s @urstrulyMahesh #SarkaaruVaariPaata Loading With #Blockbuster Vibes written All over It 💨🚀🧨@DolbyCinema FINAL CHECK 🎛🔊
Get Ready To See the #Additional #SarkaaruVaariPaataRapSong IN MY Fav Scenes of the film FULL HIGH FULL VOLUME 💥💥💥@ParasuramPetla 🧨 pic.twitter.com/aEBJLwsAU3
— thaman S (@MusicThaman) May 10, 2022
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...