సాయి పల్లవి తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలు,
కానీ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది.
కేవలం సాయి పల్లవి కోసమే సినిమాకి వచ్చే ఆడియన్స్ ఉన్నారు.
అంతలా ఫిదా చేసింది తెలుగు ఆడియన్స్ ను,
కానీ తెలుగులో ఫిదా మినహా ఇంకో హిట్ లేదు తన కెరియర్ లో,
రీసెంట్ గా రిలీజైన లవ్ స్టోరీ , శ్యామ్ సింగ రాయ్ సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. రానాతో నటించిన విరాటపర్వం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా తను చేయబోయే మరో సినిమా అప్డేట్ ఇచ్చింది సాయి పల్లవి. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించనున్నారు.
ఈ సందర్బంగా కమల్ హాసన్ తో దిగిన సాయి పల్లవి ఫోటోలని ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటెర్నేషనల్.
దీనికి రీట్వీట్ గా స్పందిస్తూ ”ఈ సమావేశంలో నేను కమల్ హాసన్ సర్ దగ్గరి నుంచి ఉత్తమ నటిగా మారేందుకు అవసరమైన పాఠాలు నేర్చుకుంటాను అనుకున్నాను. కానీ మంచి వ్యక్తిలా మారేందుకు అవసరమైన పాఠాలని నేర్చుకున్నాను. ఈ మీటింగ్ నాకెంతో ప్రత్యేకం. ఆయన నిర్మిస్తున్న సినిమాలో నేను చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నరు.