మాస్ మహారాజా.. డబుల్ ధమాకా..?

టాలీవుడ్ లో హీరోలు డ్యూయల్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు. సీనియర్ ఎన్టీ ఆర్ నుంచి ప్రస్తుతం యంగ్ హీరోల వరకు చాలా మంది డబుల్ రోల్స్ లో కనిపించారు. అలాగే మాస్ మహారాజా రవితేజ.. విక్రమార్కుడు మూవీతో రెండు పాత్రల్లో నటించడం స్టార్ట్ చేశాడు. తర్వాత వీర, కిక్ 2 తో పాటు ఇటీవల వచ్చిన డిస్కో రాజా మూవీలోనూ రవితేజ రెండు పాత్రలను పోషించాడు. 

తాాజా గా మరోసారి రవితేజ డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ సినిమాలు చేసిన త్రినాధ రావు దర్శకత్వంలో రవి తేజ ధమాకా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ కు జోడీ గా శ్రీ లీల నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మాస్ మహా రాజా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడట. 

ఓ పాత్రలో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా కూడా ఉండబోతున్నాడట. అయితే మాస్ మహారాజా.. ఇప్పటికే ద్విపాత్రాభినయం ప్రయోగాలు చేసినా.. ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఇప్పటి వరకు చేయలేదు. అయితే ఈ వార్త నిజం అయితే.. తొలి సారి విలన్ పాత్రలో రవితేజ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి మరి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు