టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎంత హైప్ క్రియేట్ అయినా.. సర్కారు వారి పాట టీంకు ప్లాప్ భయం పట్టుకుంది.
చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టార్ గా మిగిలడమే దీనికి కారణం. మహేష్ సినిమాకు వీరికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నా..? ఉందండి. పెద్ద సంబంధమే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల ధరల గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించడానికి వెళ్లింది.. ఈ ముగ్గురు హీరోలే.
ఈ మీటింగ్ కు హాజరైన వారిలో పాన్ ఇండియా స్టార్ గా పేరు ఉన్న ప్రభాస్ కు రాధే శ్యామ్ తో ప్లాప్ వచ్చింది. అలాగే ఆర్ఆర్ఆర్ తో సెన్సెషనల్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి చేసిన ఆచార్య కి కూడా డిజాస్టార్ తప్పలేదు.
ఇప్పుడు అదే భయం మహేష్ కు పట్టుకుంది. ఈ సినిమా కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంటుందా..? మహేష్ కెరీర్ లో డిజాస్టార్ గా మిగిలిపోతుందా..? అని మూవీ టీం ఆందోళన పడుతుందట. అయితే మహేష్.. చిరంజీవి, ప్రభాస్ దారిలో వెళ్తాడా.. లేదా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సూపర్ హిట్ కొడుతాడా.. అని తెలియాలంటే.. మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.