Hunt : గన్నులు అబద్ధాలు చెప్పవు

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పరిచయం అవసరం లేని పేరు. శివ మనసులో శ్రుతి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు, ప్రేమ కథా చిత్రం సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత కొన్ని చిత్రాలు వచ్చాయి కానీ, ప్రేమ కథా చిత్రం అంతటి విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. 2018 లో వచ్చిన సమ్మోహనం చిత్రం సుధీర్ బాబు కెరీర్ కు మరో విజయాన్ని అందించింది. శ్రీ దేవీ సోడా సెంటర్ తర్వాత సుధీర్ బాబు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తో పాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మామ మశ్చేంద్ర అనే చిత్రాలు చేస్తున్నారు.

తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశారు సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం చేయగా, వి. ఆనంద ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజా గా ఈ చిత్రం టైటిల్ ను ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి హంట్ : గన్స్ డోంట్ లై అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో.. బుల్లెట్స్, గన్స్ మధ్యలో నుండి సుధీర్ బాబు లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఐపీఎస్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.

కాగా ముగ్గురు పోలీస్ అధికారుల చుట్టు తిరిగే స్టోరీనే ఈ చిత్రం అని తెలుస్తుంది. సుధీర్ బాబు తో పాటు శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ కూడా పోలీస్ పాత్రలలో కనిపించబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం సుధీర్ బాబు కెరీర్ లోనే భిన్నమైన సినిమాగా రానున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు