Deepika Padukone : గుడ్ బై చెప్పింది

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నుండి తాజాగా వస్తున్న చిత్రాల్లో జవాన్ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. జవాన్ చిత్రలో షారూఖ్ ఖాన్ తో పాటు కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. అలాగే ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతుంది. వీరితో పాటు హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది. మరో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే జవాన్ టీంలో చేరిన దీపికా పదుకొనె, తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది.

జవాన్ చిత్రలో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం అందుతుంది. అందులో ఒక పాత్రకు భార్యగా దీపికా పదుకొనె కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరో పాత్రకు జోడీగా నయనతార నటిస్తుంది. అయితే దీపికా పదుకొనె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. ఒక గెస్ట్ రోల్ అన్నట్లు ఉంటుందని తెలుస్తుంది. అందుకే దీపిక పాత్ర షూటింగ్ త్వరగా పూర్తి అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిస్తుంది.

ఇది ఇలా ఉండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పెళ్లి తర్వాత కూడా స్పీడ్ తగ్గించడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ దుసుకెళ్తుంది. దీపికా పదుకొనె చేతులో ప్రస్తుతం జవాన్ తో పాటు హృతిక్ రోషన్ తో ఫైటర్ సినిమా, రణ్ వీర్ సింగ్ తో సర్కస్, ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు