Ashwin: “రివర్స్” గేర్ లో వెళ్తున్న “హిడింబ”

టాలీవుడ్ లో వచ్చేవారం విడుదలవుతున్న సినిమాల్లో “హిడింబ” ఒకటి. ఈ సినిమాలో అశ్విన్ హీరోగా నటించగా, ఈ సినిమాను అనిల్ కన్నెగంటి డైరెక్ట్ చేయగా, SVK బ్యానర్ లో శ్రీధర్ గణపట్నం నిర్మించాడు. అనిల్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత శ్వేత నటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన హిడింబ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లిద్దరూ పోలీస్ ఆఫీసర్లు గా నటించారు. అయితే పలు సినిమాల పోటీ వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా జులై20న రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నుండి గత కొద్ది రోజులనుండి ఎలాంటి అప్డేట్లు రాకపోగా, తాజాగా హిడింబ నుండి రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు. అయితే ఆ ట్రైలర్ మొత్తం రివర్స్ లో ఉన్నట్టు డిజైన్ చేసారు.

- Advertisement -

హిడింబ ట్రైలర్ మొత్తం రివర్స్ లో ఉండి ఆకట్టుకోగా, ట్రైలర్ షాట్స్, దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. కాకపొతే ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. ప్రమోషన్స్ లేక హైప్ కూడా లేని హిడింబ సినిమాకు ఈ ట్రైలర్ రిలీజ్ తో ఊపు తీసుకొచ్చారని చెప్పాలి. కానీ ఎంత ప్రమోట్ చేసినా సినిమా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. మరి జులై 20న రిలీజ్ అవుతున్న హిడింబ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు