Venky75: “సైంధవుడి” యుద్ధం ఆ పాపకోసమేనా?

టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో “సైంధవ్” కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను “హిట్” సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వెంకటేష్ కి ల్యాండ్ మార్క్ (75వ సినిమా) కావడంతో వెంకటేష్ అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. దీనికితోడు ఈ సినిమా యొక్క గ్లిమ్ప్స్, కీలక పాత్రధారుల ఫస్ట్ లుక్స్ అన్నీ ఆకట్టుకోవడంతో టాలీవుడ్ లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.

ఇక ఈ సినిమా యొక్క షూటింగ్ ఇప్పటికే 70శాతం కంప్లీట్ అవగా, తాజాగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక సైంధవ్ నుండి ఇప్పటివరకు హీరో,హీరోయిన్ల లుక్స్ తో పాటు, ఇతర ప్రధాన పాత్రధారుల లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో పాత్ర ని రివీల్ చేసారు మేకర్స్. తాజాగా సైంధవ్ సినిమాలో సారా అనే చిన్న పాప గాయత్రి పాత్రలో నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేయడం జరిగింది.

ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాప ఫస్ట్ లుక్ ద్వారా కథ నేపథ్యం విషయంలో ఒక విషయం తెలుస్తుంది. సైంధవుడంటే మహాభారతంలో పాండవులను వారి సమస్త సైన్యాన్ని ఒక్కడే నిలబడి నిరోధించగల వీరుల్లో ఒకడు. అంటే ఈ సినిమాలో శత్రువులు ఎంతమందొచ్చినా తానొక్కడే ఉండి ఎదుర్కొంటాడని పేరు ద్వారానే చెప్పడం జరిగింది. కానీ అది ఎందుకోసం ఎవరికోసమో చెప్పలేదు.

- Advertisement -

కానీ ఇప్పుడు రిలీజ్ అయిన పాప ఫస్ట్ లుక్ లో వెంకటేష్ టీజర్ లో కనిపించిన లుక్ లోనే, మొహం మీద రక్తం కారుతున్న లుక్ లో పాపతో కలిసి ఉంది. దీన్నీ బట్టి సినిమాలో సైంధవ్ చేసే పోరాటం ఆ పాపకోసమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు గాని సినిమా కోసం, వెంకటేష్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ కోసం వెంకీ అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా 2023 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు