Nayakudu: అక్కడ బ్లాక్ బస్టర్… మరి ఇక్కడ?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో “నాయకుడు” ఒకటి. తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్ హీరోగా, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తమిళంలోనే తెరకెక్కింది. కర్ణన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన మారి సెల్వరాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో భారీ అంచనాలతో విడుదలైంది. రెండు వారాలకిందట మామన్నన్ తమిళ్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా సాధించింది.

దాదాపు 60కోట్లు వసూలు చేసిన మామన్నన్ తెలుగులో ఈ వారం అనగా జులై 14న నాయకుడు పేరుతో డబ్ అయింది. అయితే ఈ సినిమాకి అక్కడ వచ్చినంత రెస్పాన్స్ తెలుగులో రాలేదు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా, స్లో నేరేషన్ వల్ల ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. ఇక నాయకుడు సినిమా మూడు రోజులు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో 1.28కోట్ల గ్రాస్ ని 60 లక్షల దాకా షేర్ ని సాధించింది. అయితే తెలుగులో 2కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ నాయకుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కానీ అది సాధ్యం కాదనిపిస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాకి తెలుగులో సరైన ప్రమోషన్ కూడా చెయ్యలేదు. అదీగాక ఇతర సినిమాల పోటీ వలన నాయకుడు సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ప్లాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఈ సినిమా స్టేటస్ మారాలంటే ఎదో ఒక మిరాకిల్ జరగాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు