Mission Impossible7: 5రోజుల్లో 2000కోట్లు.. ఈ రేంజ్ ఊహించలేదు?

హాలీవుడ్ సినిమాల్లో మల్టీవర్స్ సినిమాలు, సిక్వెల్ సినిమాలు కామన్ అని తెలిసిందే. మార్వెల్ మూవీస్, హ్యారీ పోటర్ సిరీస్, లాగా “మిషన్ ఇంపాసిబుల్” సిరీస్ కూడా చాలా పాపులర్. ఈ సిరీస్ లో విజువల్ వండర్స్ ఏమి పెద్దగా ఉండవుగాని, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా ఉంటాయి ఇందులో వచ్చిన సినిమాలు. ముఖ్యంగా ఈ సినిమాల్లో టామ్ క్రూజ్ చేసే రియల్ స్టంట్స్ యాక్షన్ ఎపిసోడ్లకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ సిరీస్ లో 7వ సినిమా వచ్చింది.

“మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికొనింగ్ పార్ట్1” పేరుతో జులై12 న విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన 5 రోజులలోనే భారీ కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇండియా లో రిలీజ్ అయిన 4రోజుల్లోనే 46కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి ఈ సిరీస్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది.

ఇక మిషన్ ఇంపాసిబుల్ వరల్డ్ వైడ్ గా 5రోజుల్లో 235 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే అక్షరాలా 1931కోట్లు అన్నమాట. ఆరవ రోజు మార్నింగ్ షోలకే 2000కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది. టాక్ పరంగా ముందు వచ్చిన సినిమాలంత రాకపోయినా ఆడియన్స్ ఈ సినిమా యాక్షన్ కి కనెక్ట్ అయ్యారు. ఓవరాల్ గా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో టాప్ ప్లేస్ లో నిలవబోతుంది అని అనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ లో 7వ సినిమా గా వచ్చిన ఈ సినిమా పార్ట్ 1గానే వచ్చింది. అంటే ఈ సినిమాకి పార్ట్ 2 ఉందన్నమాట. అయితే ఆ సినిమాని 2024లోనే రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు