Tollywood: ఒకేసారి రెండు సినిమాలు.. మళ్ళీ ఆ రోజులు వచ్చినట్టేనా?

టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. కారణాలేవైనా సరే హీరోలు మాత్రం ఏడాదికి ఒక్క సినిమాతో టాప్ హీరోలైతే సంవత్సరంన్నర నుండి రెండేళ్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. టాప్ హీరోల మొదలు కొని చాలా మంది హీరోలు వరుస ప్రాజెక్టులు ఒకేసారి అనౌన్స్ చేస్తున్నారు. ప్రభాస్, నితిన్, నిఖిల్, విజయ్ దేవరకొండ ఇలా అందరూ ఒకేసారి రెండు నుండి మూడు సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు.

ఒకప్పుడు సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలకే ఇవి సాధ్యమయ్యాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కూడా ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ పైకి తీసుకువచ్చాడన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్ లో పాల్గొన్నాడు. అందులో బ్రో పూర్తయిపోగా, మరో సినిమా షూట్ కూడా ఎండింగ్ కి వచ్చేసింది.

ఇప్పుడు చాలా మంది హీరోలు ఇదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి రెండేళ్ళకి ఒక్క సినిమా మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ఆల్రెడీ ఈ ఏడాది ఆదిపురుష్ తో పలకరించగా, సెప్టెంబర్ లో సలార్ గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఫినిష్ చేస్తూనే ప్రాజెక్ట్ K సెట్స్ లో కూడా బిజీ అవుతున్నాడు.

- Advertisement -

ఇక నితిన్ వక్కంతం వంశీ తో ఓ సినిమా, వెంకీ కుడుముల తో మరో సినిమా చేస్తున్నాడు. అటు లిగర్ తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ ఎలాగైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నా రెండు చిత్రాలు చేస్తున్నాడు. శివ నిర్వాణ తో చేస్తున్న ఖుషి ఆల్రెడీ ఫినిషింగ్ దశకు చేరుకోగా, పరశురాం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

ఇక ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల్లో టాప్ పొజిషన్ లో ఉన్న నాగ చైతన్య రీసెంట్ గా తగిలిన ఎదురు దెబ్బలవలన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చెయ్, త్వరలో శివ నిర్వాణ తో కూడా చేస్తున్నాడు. ఇక సీనియర్ స్టార్ రవితేజ గురించి తెలిసిందే. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు మూడు మూవీస్ సెట్స్ లోనే ఉంచుతాడు.

ఇండస్ట్రీ లో జరిగిన ఈ మార్పుకి అందరూ సంతోషిస్తున్నా, ఒక రకంగా డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొంత మంది నటులు వేగంగా సినిమాలు తీయాలనో, లేక ఎక్కువ డబ్బు సంపాదించాలనో, అభిమానుల ఒత్తిడి వల్లో సినిమాలలో కంటెంట్ పై దృష్టి పెట్టకుండా వెంటవెంటనే షూట్ చేసి రిలీజ్ చేస్తారు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టాల పాలవడమే కాకుండా, ప్రేక్షకులు కూడా ఓటిటీల వైపే మొగ్గు చూపుతారు. ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు గ్రహించి ప్రేక్షకులకనుగుణంగా కొత్తగా తీస్తే బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు